వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య శవంతో 10 కి.మీ: మారిన మాఝీ లైఫ్ స్టైల్, మరో వివాహం, బైక్ కొనుగోలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: ఓ చిన్న ఘటన జీవితాన్ని మలుపు తిప్పుతోందని అంటుంటారు. నిజమే ఒడిశాకు చెందిన గిరిజనుడు ధనా మాఝీ జీవితాన్ని కూడ ఓ ఘటన మలుపు తిప్పింది. ఏడాది క్రితం వరకు ధనా మాఝీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఏడాది క్రితం తన భార్య శవాన్ని 10 కి.మీ. దూరం భుజాన మోసుకొచ్చిన ఘటన మాఝీ జీవితాన్ని మలుపు తిప్పింది.

ఒడిశాకు చెందిన ధన మాఝీ అనే వ్యక్తి భార్య గత ఏడాది అనారోగ్యంతో మరణించింది. ఆమె మరణించిన సమయంలో అంబులెన్స్ ఇవ్వకపోవడంతో ఒడిశాకు చెందిన ధన మాఝీ అనే వ్యక్తి 10 కి.మీ దూరం తన భార్య శవాన్ని మోసుకెళ్ళాడు.

10 కి.మీ దూరం భార్య శవాన్ని మోసుకెళ్ళిన మాఝీ ఉదంతాన్ని మీడియా ప్రముఖంగా ప్రసారం చేసింది. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో మాఝీ జీవితాన్ని ఈ ఘటన మార్చేసింది.

 మాఝీ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన

మాఝీ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన

గత ఏడాది అంబులెన్స్ నిరాకరించడంతో పది కి.మీ. దూరం భార్య శవాన్ని మోసుకెళ్ళిన మాఝీ అనే గిరిజనుడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.చేతిలో చిల్లిగవ్వ లేని కారణంగానే తన భార్య శవాన్ని భుజంపై మోసుకెళ్ళాడు. ఈ ఘటనపై పలువురు ఆ సమయంలో చలించిపోయారు.మాఝీ ఉదంతంపై ఆ సమయంలో సోషల్ మీడియాలో హట్ టాపిక్‌గా మారింది. పలువురు ఈ ఘటనపై తమ వంతు సహయాన్ని అందించారు. బహ్రెయిన్ రాజు కూడ మాఝీకి ఆర్థిక సహయం చేశారు.

 మాఝీ జీవితంలో మార్పులు

మాఝీ జీవితంలో మార్పులు

భార్య చనిపోయే సమయంలో మాఝీ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అయితే భార్య చనిపోయి మాఝీ కుటుంబంలో వెలుగు నింపిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భార్య మృతదేహంతో పది కిలోమీటర్లు భుజాన మోసుకెళ్ళిన ఘటనపై మాఝీ జీవితాన్ని మలుపుతిప్పిన విషయాన్ని గిరిజనులు ప్రస్తావిస్తున్నారు. మీడియాలో వచ్చిన ఈ కథనంతో చలించిపోయిన అనేక మంది మాఝీకి సహయం చేశారు.దీంతో మాఝీ లైఫ్‌స్టైల్ మారిపోయింది.

 మరో వివాహం చేసుకొన్న మాఝీ

మరో వివాహం చేసుకొన్న మాఝీ

ఒడిశాలోని కలహండి జిల్లాకి చెందిన ధనా మాఝీ భార్య అనారోగ్యానికి గురై గతేడాది ఆగస్టులో చనిపోయింది.ఆమె మృతదేహంతో మాఝీ 10 కి.మీ. నడిచాడు. దీంతో

బహ్రెయిన్‌ ప్రధానమంత్రి, రాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా మాఝీకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.రూ.9లక్షల చెక్కును బహ్రెయిన్‌ రాజు మాఝీకి పంపించారు. ఆయనతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా మాఝీకి సహాయం చేశాయి.మాఝీ అలమతి దై అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.. ప్రస్తుతం ఆమె గర్భిణి.

మోటార్ బైక్ కొన్న మాఝీ

ప్రధానమంత్రి గ్రామీణ్‌ ఆవాస్‌ యోజనా కింద కొత్త ఇంటిని అధికారులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ ఇల్లు నిర్మాణ దశలో ఉంది. అతడికి సహాయం కింద వచ్చిన నగదును బ్యాంకులో కుమార్తెల పేరిట ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేశాడు. ముగ్గురు కుమార్తెలు భువనేశ్వర్‌లోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో చక్కగా చదువుకుంటున్నారు. ఓ విద్యాసంస్థ ఆయన కుమార్తెలకు ఉచితంగా విద్యను అందిస్తుంది. మాఝీ రూ.65వేలు విలువ చేసే హోండా ద్విచక్రవాహనాన్ని కూడా కొనుగోలు చేశారు.

English summary
First a house, then a wife, and now a motorbike. Dana Majhi, the poor Odisha tribal who last year shook the nation’s conscience after being forced to walk back home with the body of his dead wife on his shoulder, has struck it rich.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X