Wife: రాజమండ్రి భార్య మీద డౌట్, చెన్నైలో భర్త ఏం చేశాడంటే ?, కట్టుకున్న చీరతోనే ఆంటీని !
చెన్నై/రాజమండ్రి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం కొన్ని సంవత్సరాల క్రితం దంపతులు పొరుగు రాష్ట్రానికి వెళ్లారు. దంపతులు ఫామ్ హౌస్ లో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలంగా రాజమండ్రి భార్య మీద భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. నా భార్య చెప్పిన మాట వినడం లేదని భర్త రగిలిపోయాడు. రాత్రి దంపతుల మద్య రచ్చరచ్చ అయ్యింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన భర్త అతని భార్య కట్టుకున్న చీరతోనే ఆమె మెడ బిగించి చంపేశాడు. భార్యను హత్య చేసిన భర్త మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగేశాడు.

రాజమండ్రి టూ చెన్నై
ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో నివాసం ఉంటున్న భరత్ (52) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం సుజాత (49) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న భరత్, సుజాత దంపతులు సంతోషంగా కాపురం చేశారు. సుజాత, భరత్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొట్టకూటి కోసం 14 సంవత్సరాల క్రితం భరత్, సుజాత దంపతులు పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజధానిని చెన్నైకి వెళ్లారు.

ఫామ్ హౌస్ లో ఉద్యోగం
చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని రాఘవేంద్ర ఫామ్ హౌస్ లో గత 10 సంవత్సరాల నుంచి భరత్ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు సంవత్సాల నుంచి సుజాత కూడా అదే ఫామ్ హౌస్ లో పని చేస్తోంది. ఒకే ఫామ్ హౌస్ లో సుజాత, భరత్ దంపతులు ఉద్యోగం చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం వరకు భరత్, సుజాత దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

భార్య మీద అనుమానం
కొంతకాలంగా రాజమండ్రి భార్య సుజాత మీద ఆమె భర్త భరత్ కు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో భరత్, సుజాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య సుజాతతో గొడవపడుతున్న భరత్ కొంతకాలం ఆమెతో మాట్లాడకుండా ఉండటం, తరువాత కలిసిపోయి కాలం గడుపుతూ వస్తున్నాడు.
Recommended Video


భార్యను ఆమె చీరతో చంపేసి ఆత్మహత్యాయత్నం
నా భార్య సుజాత చెప్పిన మాట వినడం లేదని భరత్ రగిలిపోయాడు. రాత్రి భరత్, సుజాత దంపతుల మద్య రచ్చరచ్చ అయ్యింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన భరత్ అతని భార్య సుజాత కట్టుకున్న చీరతోనే ఆమె మెడ బిగించి ఉరి వేసి చంపేశాడు. భార్య సుజాతను హత్య చేసిన భరత్ మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగేశాడు.

మ్యాటర్ మాత్రం తెలీదు
విషయం గుర్తించిన కొడుకు ఆంబులెన్స్ కు ఫోన్ చేసి భరత్ ను ఆసుపత్రికి తరలించారు. భరత్ పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే భరత్ అతని భార్య సుజాతను ఎందుకు హత్య చేశాడు ? అనే విషయం మాత్రం కచ్చితంగా తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications