Wife: బిగ్ షాట్ భార్య, భర్త ఫ్రెండ్ తో రొమాన్స్, భర్త హత్యకు ఆన్ లైన్ లో ఏం ఆర్డర్ చేసిందంటే, కిల్ కిలాడి !
ముంబాయి/పంజాబ్: ప్రియుడి మోజులో పడిన ప్రముఖ వ్యాపారవేత్త భార్య ఈ ప్రపంచానే మరిచిపోయింది. భర్త క్లోజ్ ఫ్రెండ్ ప్రియుడు కావడం, ప్రియుడు రోజూ ఇంటికి రావడంతో ఆమె అతనితో ఎంజాయ్ చేసింది. ప్రియుడి వ్యామోహంలో భర్తను చంపడానికి స్కెచ్ వేసింది, పక్కాప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. భర్త అనారోగ్యంతో చనిపోయాడని భార్య నాటకాలు ఆడింది. భర్త గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ కావడం, అతనికి చాలా వ్యాపారాలు ఉండటంతో పోలీసులు ఆ కేసు మీద ఓ కన్ను వేశారు. ఇదే సమయంలో వ్యాపారిని హత్య చేశారని అతని భార్య, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. భర్త హత్యకు భార్య ఆన్ లైన్ లో కొన్ని ఆర్డర్ చేసిందని వెలుగు చూసింది. భర్త హత్యకు అతని భార్య, ఆమె ప్రియుడు వేసిన ప్లాన్ చూసి పోలీసులు షాక్ అయ్యారు.

ముంబాయిలో ప్రముఖ వ్యాపారి
ముంబాయిలో కమల్ కాంత్ షా అలియాస్ కమల్ కాంత్ (46) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కమల్ కాంత్ కు కాజల్ షా అలియాస్ కాజల్ (45) అనే భార్య ఉంది. కమల్ కాంత్ కు సొంతంగా గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఉంది, గార్మెంట్స్ ఫ్యాక్టరీతో పాటు కమల్ కాంత్ అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. కమల్ కంత్ స్నేహితుడు హితేష్ జైన్ (46) అనే వ్యక్తి స్నేహితుడు కమల్ కాంత్ గార్మెంట్స్ ఫ్యాక్టరీతో పాటు అతని వ్యాపారాలు చూసుకుంటున్నాడు.

వ్యాపారి హత్య కేసుతో షాక్
గత డిసెంబర్ నెలలో గార్మెంట్స్ ఫ్యాక్టరీ యజమాని కమల్ నాథ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. నా భర్త కమల్ నాథ్ అనారోగ్యంతో చనిపోయాడని ఆయన భార్య కాజల్ నాటకాలు ఆడింది. కాజల్ భర్త కమల్ నాథ్ ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ కావడం, అతనికి చాలా వ్యాపారాలు ఉండటంతో ముంబాయి పోలీసులు ఆ కేసు మీద ఓ కన్ను వేశారు. ఇదే సమయంలో వ్యాపారి కమల్ నాథ్ ను హత్య చేశారని అతని భార్య, ప్రియుడిని ముంబాయి పోలీసులు అరెస్టు చేశారు.

స్లోపాయిజన్ తో హత్య
స్లో పాయిజనింగ్ కేసులో కాజల్, ఆమె ప్రేమికుడు హితేష్ జైన్ కలిసి కాజల్ భర్త కమల్ కాంత్ కు ఆర్సెనిక్, థాలియం కలిపి ఇచ్చి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యంగా నిందితులు కాజల్ ,హితేష్ ఉపయోగించిన థాలియంను ఆన్ లైన్ లో పంజాబ్ నుండి వారి ఇంటికి ఆర్డర్ చేసినట్లు ముంబాయి పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కోరియ్ పంపించిన ఆధారిత సంస్థ పార్శిల్‌లోని విషయాల గురించి కమల్ కాంత్ కొడుక్కి తెలియనప్పటికీ అతని కొడుకు ముంబైలోని అతని ఇంటికి వచ్చిన పార్శిల్ తీసుకున్నాడని పోలీసులు చెప్పారు. కమల్ కాంత్ హత్య కేసులో ఇప్పటికే అతని భార్య కాజల్, ఆమె ప్రియుడు హితేష్ జైన్ అరెస్టు అయ్యి జైల్లో ఉన్నారు.

ఆహారంలో స్లోపాయిజన్ మిక్స్ చేసి ఇచ్చేసిన భార్య
ముంబాయి పోలీసుల కథనం ప్రకారం నిందితురాలు కాజల్, ఆమె ప్రియుడు హితేష్ జైన్ కలిసి వ్యాపారి కమల్ కాంత్ తీసుకుంటున్న ఆహారంలో ఆర్సెనిక్, థాలియం కలిపి ఇచ్చారని, ప్రతినిత్యం స్లోపాయిజన్ గా ఈ పదార్థాలు ఆహారంలో కలిపి ఇవ్వడంతో 2022 డిసెంబర్ 20వ తేదీన కమల్ కాంత్ ప్రాణం పోయిందని పోలీసులు అన్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పంజాబ్‌కు చెందిన ఓ కంపెనీ నుండి అపాయింట్‌మెంట్ తీసుకుంది. తరువాత అధికారులు ఆ కంపెనీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.

ప్రియుడి ఇంటికి స్లోపాయిజ్ పార్శిల్
పంజాబ్ కంపెనీ రికార్డులలో హితేష్ జైన్ చిరునామాకు థాలియం డెలివరీ పంపబడిందని మేము కనుగొన్నాము. ఆ పార్శిల్ ను అతని కొడుకు అందుకున్నాడు. అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన పార్శిల్‌లోని విషయాల గురించి అతని కుమారుడికి తెలియదు. కమల్ కాంత్‌ను చంపడానికి ఉపయోగించిన థాలియంతో హితేష్ జైన్ ఇంటికి పార్శిల్ వెళ్లిందని, ఈ కేసులో ఈ వివరాలు కీలక సాక్షంగా నిలిచాయని ముంబాయి పోలీసులు అంటున్నారు.

నాటకాలు ఆడిన భార్య
నిందితులు ఆర్సెనిక్‌ను సేకరించిన పంజాబ్ లోని దుకాణాన్ని కూడా ముంబాయి పోలీసులు గుర్తించారు. నిందితుడు హితేష్ జైన్ తనకు మంచి నాణ్యమైన ఆర్సెనిక్ కావాలని దుకాణదారునికి చెప్పాడు, నేను వ్యాపారం ప్రారంభిస్తున్నానని అతన్ని నమ్మించాడు. బాంబే హాస్పిటల్‌లోని వైద్యులు మొత్తం కుటుంబాన్ని రక్త పరీక్ష చేయించుకోవాలని కోరినప్పుడు కమల్ కాంత్ భార్య కాజల్ వైద్య పరీక్ష చేయించుకోవడానికి వారం పాటు ఆలస్యం చేసిందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో కాజల్ ఆహారంలో థాలియం తీసుకుందని, పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుందని, ఆ కారణంగా ఆమె రక్తపరీక్షల నివేదికలో కొంత మొత్తంలో థాలియం ఉన్నట్లు వెలుగు చూసిందని పోలీసు అధికారులు అంటున్నారు.

అత్తను కూడా చంపేసిందా ?
గత సంవత్సరం ప్రముఖ వ్యాపారి కమల్ కాంత్ తల్లి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కమల్ కాంత్ మరణంలో నిందితులు కాజల్ ,హితేష్ జైన్ కుకు ప్రమేయం ఉందా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కమల్ కాంత్ తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆమె మృతదేహాన్ని దహనం చేశారని, ఆమెకు కూడా ఆర్సెనిక్ మరియు థాలియం ఇచ్చారా అని కనుగొనడం పోలీసులకు కష్టంగా ఉందని తెలిసింది. మొత్తం మీద కాజల్ ఆమె భర్త కమల్ కాంత్ ను హత్య చెయ్యడానికి ఆన్ లైన్ లో స్టోపాయిజన్ తెప్పించిందని వెలుగు చూడటంతో కేసులో కీలకసాక్షాలు పోలీసులకు చిక్కాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications