• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్రమ సంబంధం, లేడీ వలలో పడి బతుకు బూడిద, భార్య!

|

చెన్నై/కరూర్: పరాయి స్త్రీ వ్యామోహంలో జల్సాలు చేస్తూ నిత్యం ఇంటికి రాకుండా అక్కడక్కడే తిరుగుతూ మానసికంగా టార్చర్ పెడుతున్న పారిశ్రామికవేత్తను అతని భార్య దారుణంగా హత్య చేసింది. తల్లిని నిత్యం తండ్రి వేధింపులకు గురి చేస్తున్నాడని తెలుసుకున్న కుమారుడు సైతం హత్య చెయ్యడానికి సహకరించారు. చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతదేహం ఎవ్వరూ గుర్తు పట్టుకుండా ఉండాలని కారులో పెట్టి బూడిద చేసిన ఘటన తమిళనాడులోని కరూరు జిల్లాలో జరిగింది.

ఏకాంతంగా లవర్స్, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్, నిలువు దోపిడీ, సోషల్ మీడియాలో, పరువు!

 సాఫీగా సంసారం

సాఫీగా సంసారం

కరూరు జిల్లా నొయ్యల్ ప్రాంతంలో రంగస్వామి (51), కవితా (41) దంపతులు నివాసం ఉంటున్నారు. రంగస్వామి, కవితాల కుమారుడు అశ్విన్ కుమార్ (19), రంగస్వామి భార్య కవితా, కుమారుడు అశ్విన్ కుమార్ తో కలిసి కొంత కాలం కిత్రం వరకు సంతోషంగానే ఉన్నాడు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం

రియల్ ఎస్టేట్ వ్యాపారం

రంగస్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగా డబ్బులు సంసాధిస్తున్న రంగస్వామి ఇంటికి అప్పుడప్పుడు రాకుండా బయటే ఉండేవాడు. ఏమిటి ఇంటికి రావడంలేదని భార్య కవితా ప్రశ్నిస్తే వ్యాపారం విషయంపై బయట ఊరికి వెళ్లానని, అందుకే ఇంటికి రాలేకపోయానని రంగస్వామి ఆమెను నమ్మిస్తున్నాడు.

అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

విచ్చలవిడిగా డబ్బులు సంపాధిస్తున్న రంగస్వామి పరాయి స్త్రీ మోజులో పడిపోయాడు. డబ్బులు కోసం తన చట్టూ తిరుగుతున్న మహిళలతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ విషయాలు ఇంట్లో భార్య కవితాకు తెలీకుండా రంగస్వామి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు.

 అనుమానం వచ్చి ఆరా తీస్తే!

అనుమానం వచ్చి ఆరా తీస్తే!

భర్త రంగస్వామి ప్రవర్తన మీద భార్య కవితాకు అనుమానం వచ్చింది. భర్తకు తెలీకుండా కవితా ఆరా తియ్యడం మొదలు పెట్టింది. భర్త రంగస్వామి భాగోతం తెలుసుకోవడానికి కవితా కుమారుడు అశ్విన్ కుమార్ సహాయం తీసుకుంది. రంగస్వామి ఎక్కెడికెక్కిడికి వెళ్లి వస్తున్నాడు అంటూ కవితా సమాచారం సేకరించింది.

 పద్దతి మార్చుకో స్వామి!

పద్దతి మార్చుకో స్వామి!

మీ పద్దతి మార్చుకోవాలని, పరాయి స్త్రీలతో తిరుగితే మీకే మంచిది కాదని, అక్రమ సంబంధం అనేక అనర్తాలకు దారి తీస్తుందని కవితా భర్త రంగస్వామికి నచ్చచెప్పింది. అయితే రంగస్వామి పద్దతిలో మార్పురాలేదు. భర్త రంగస్వామి తీరుతో కవితా విసిగిపోయింది.

ఇక లాభం లేదని చంపేశారు

ఇక లాభం లేదని చంపేశారు

రంగస్వామికి ఇక ఎంత చెప్పినా లాభం లేదని కవితా నిర్ణయించుకుంది. ఇంటిలో ఘాడంగా నిద్రపోతున్న భర్త రంగస్వామిని హత్య చెయ్యాలని కవితా నిర్ణయించింది. అంతే కుమారుడు అశ్విన్ కుమార్ సహాయంతో రంగస్వామి గొంతు బిగించిన కవితా హత్య చేసింది. రంగస్వామి మృతి చెందాడని కవితా, అశ్విన్ కుమార్ నిర్ధారించుకున్నారు.

కారులో పెట్రోల్ పోసి తగలబెట్టారు

కారులో పెట్రోల్ పోసి తగలబెట్టారు

రంగస్వామి మృతదేహాన్ని కారులో కరూరు జిల్లా పరమత్తి సమీపంలోని కుప్పం- వేలామ్ పాలైయమ్ మార్గంలోకి తీసుకెళ్లారు. కారులో వెనుక రంగస్వామి మృతదేహం పెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారైనారు. విషయం గుర్తించిన స్థానికులు పరమత్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

నాటకాలు చాలు!

నాటకాలు చాలు!

కారును పరిశీలించిన పోలీసులు అందులో మృతదేహం ఉన్న విషయం గుర్తించారు. అయితే మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేశారు. నేరుగా రంగస్వామి ఇంటికి వెళ్లిన పోలీసులు అతని భార్య కవితాను ప్రశ్నించారు. వ్యాపారం విషయంలో బయటకు వెళ్లిన రంగస్వామి ఇంటికి తిరిగి రాలేదని కవితా పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు కవితా నాటకాలు ఆడుతోందని గుర్దించి ఆమెను బెండ్ తియ్యడంతో అసలు విషయం అంగీకరించింది. కవితా, ఆమె కుమారుడు అశ్విన్ కుమార్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
Tamil Nadu: Wife killed her husband with the help of son due to illegal relationship near karur and arrested now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X