వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను చంపి రెండురోజులు శవంతోనే...

ఒక్క పైసా సంపాదించకుండానే కష్టపడి తాను తెచ్చిన డబ్బులతో తాగి రావడమే కాకుండా తనను కొట్టే భర్తను ఓ భార్య హత్యచేసింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడింది అయితే అంత్యక్రియలు నిర్వహించే .

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒక్క పైసా సంపాదించకుండానే కష్టపడి తాను తెచ్చిన డబ్బులతో తాగి రావడమే కాకుండా తనను కొట్టే భర్తను ఓ భార్య హత్యచేసింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడింది అయితే అంత్యక్రియలు నిర్వహించే సమయంలో పోలీసులు రంగప్రవేశంతో అసలు విషయం వెలుగుచూసింది.

ప్రతిరోజూ తాగొచ్చి తనను కొడుతున్న భర్తను ఓ భార్య గొంతు నులిమి చంపేసింది. అయితే రెండురోజుల పాటు శవాన్ని గదిలోనే పెట్టింది. శవాన్ని ఏం చేయాలో తెలియక భర్త గుండెపోటుతో మరణించాడని ఆమె స్థానికులను నమ్మించింది.

Wife kills ‘abusive’ husband, gets caught minutes before body is cremated

అయితే ఈ విషయాన్ని స్థానికులు కూడ నమ్మారు. అయితే అంత్యక్రియలు చేసే సమయంలో శవంపై గాయాలుండడాన్ని చూసిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే చివరినిమిషంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. ఈ విషయమై పోలీసులు నిందితురాలిని ప్రశ్నించారు. దీంతో ఆమె అసలు విషయాన్ని ఆమె వివరించింది.

ఈ ఘటన న్యూఢిల్లీలోని కాపస్‌హెడాలో గురువారం నాడు వెలుగుచూసింది. బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్‌కు చెందిన శిల్పి అధికారి రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్‌లో నాలుగవ తరగతి ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు భర్త నితీష్ , ఇద్దరు పిల్లలున్నారు. అయితే తన భర్త తాగుడుకు బానిసగా మారాడు. ప్రతిరోజూ వచ్చి తనను కొట్టేవాడని ఆమె పోలీసులకు వివరించింది.

అయితే గురువారంనాడు భర్తకు బాగా తాగించింది. ఆయన మత్తులోకి జారుకొన్న తర్వాత గొంతు నులిమి చంపేసింది. శవాన్ని ఏం చేయాలో తోచక రెండురోజుల పాటు శవంతోపాటే అదే గదిలో గడిపింది. చివరినిమిషంలో భర్తను హత్య చేసిన విషయాన్ని ఆమె పోలీసుల విచారణలో ఒప్పుకోక తప్పలేదు.

English summary
A woman was arrested in Delhi on Tuesday after she allegedly killed her husband for repeatedly thrashing her after getting drunk. The crime was not caught until the last moment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X