
Wife: మరదలి మీద కన్ను, రాత్రి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన భర్త, మరదలిని పట్టుకుని బావ ఏం చేశాడంటే !
రాయ్ పూర్/చత్తీస్ గఢ్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే భర్త సోదరులు, దగ్గర బంధువులు నివాసం ఉంటున్నారు. ఇదే సమయంలో తమ్ముడి భార్యతో బావ చనువుగా ఉండటానికి ప్రయత్నించాడు. కొంతకాలం తరువాత రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అన్న హత్యకు గురైనాడు. 20 రోజుల తరువాత తమ్ముడే అతని సొంత అన్నను హత్య చేశాడని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.
చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ సమీపంలోని బలోద్ జిల్లాలోని కురెట్టి మాంగ్ చూవా ప్రాంతంలో గోవింద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న గోవింద్ అతని భార్య ఆశా (పేరు మార్చడం జరిగింది)తో సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

గోవింద్, ఆశా దంపతులు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే భర్త సోదరులు, దగ్గర బంధువులు నివాసం ఉంటున్నారు. గోవింద్ సొంత సోదరుడు క్రిష్ణ అదే ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడు. క్రిష్ణ అతని తమ్ముడు గోవింద్ ఇంటికి ఎక్కువగా వచ్చి వెలుతున్నాడు. ఇదే సమయంలో తమ్ముడు గోవింద్ భార్య ఆశా మీద ఆమె భర్త క్రిష్ణ కన్ను వేశాడు.
20 రోజుల క్రితం గోవింద్ పనిమీద బయటకు వెళ్లాడు. అదే రోజు తనతమ్ముడు గోవింద్ ఇంట్లో లేడని తెలుసుకున్న క్రిష్ణ అతని తమ్ముడు ఇంటికి వెళ్లి మరదలి మీద లైంగికదాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. బావ బారి నుంచి తప్పించుకోవడానికి ఆశా ప్రయత్నించింది. ఆసమయంలో మరదలు తప్పించుకోకుండా క్రిష్ణ ఆమెను పట్టుకుని ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు.
అదే సమయంలో భర్త గోవింద్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన భార్య మీద సొంత అన్న క్రిష్ణా అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడని రగిలిపోయిన గోవింద్ అతన్ని చంపేశాడు. భార్య సహాయంతో క్రిష్ణ శవాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లి ఊరి సమీపంలోని నదీ కాలువ పక్కన పూడ్చేశారు. క్రిష్ణ భార్య, కొడుకు కేసు పెట్టడంతో 20 రోజుల నుంచి కేసు విచారణ చేస్తున్న పోలీసులు చివరికి అతని తమ్ముడు గోవింద్ ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.