Wife: సెలైన్ లో సైనెడ్ ఇంజెక్షన్ వేసి భార్యను చంపిన భర్త, భార్య కంటే వయసులో చిన్నోడు, ఆ విషయంలో !

అహమ్మదాబాద్/చెన్నై: వయసులో తేడా ఉన్నా ఇద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలని అనుకున్నారు. భార్యకు 38 ఏళ్లు, ఆమె భర్తకు 32 సంవత్సరాలు. కొంతకాలం సంతోషంగా కాపురం చేసిన దంపతుల మద్య ఆ విషయంలో తేడాలు వచ్చాయి. చక్కగా కాపురం చేస్తున్న వీరి జీవితంలో ఇద్దరి మద్య వైవాహిక విభేదాలు వచ్చాయి. చాలా కాలం ఎవరిపాటికి వాళ్లు వారికి ఇష్టం వచ్చినట్లు జీవించారు. ఒకే ఇంట్లో ఉంటున్న దంపతులు ఎవరు ఎలా ఉన్నా ఒకరి గురించి ఒకరు పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. నెల క్రితం ఛాతి నొప్పితో భార్య ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న భార్య మరణించింది. అనారోగ్యంతో మహిళ మరణించిందని మొదట పోలీసులు అనుకున్నారు. అయితే పోస్టుమార్టుం నివేదిక, ఫోరెన్సిక్ రిపోర్డులో ఆమె శరీరంలోకి సైనెడ్ ఇంజెక్షన్ చేశారని వెలుగు చూడటంతో కథ కొత్త మలుపు తిరిగింది.

 భార్యకు 38 ఏళ్లు, భర్తకు 32 ఏళ్లు

భార్యకు 38 ఏళ్లు, భర్తకు 32 ఏళ్లు

గుజరాత్ లో నివాసం ఉంటున్న జిగ్నేష్ పటేట్ (32) అనే యువకుడు అతని కంటే వయసులో పెద్దదైన ఊర్మిళ వాసవ (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వయసులో తేడా ఉన్నా ఇద్దరూ పెళ్లి చేసుకున్నామని, సంతోషంగా జీవించాలని ముందే అనుకున్నారు. భార్యకు 38 ఏళ్లు, ఆమె భర్తకు 32 సంవత్సరాలు అని ఎవరు ఏమనుకున్నా మనకెందుకు అని డిసైడ్ అయ్యారు.

 కాపురంలో తేడాలు వచ్చేశాయి

కాపురంలో తేడాలు వచ్చేశాయి

జిగ్నేష్, ఊర్మిళ దంపతులు గుజరాత్ లోని అంకలేశ్వర్ పట్టణంలో కాపురం పెట్టారు. కొంతకాలం సంతోషంగా కాపురం చేసి జిగ్నేష్, ఊర్మిళ దంపతుల మద్య తేడాలు వచ్చాయి. చక్కగా కాపురం చేస్తున్న జిగ్నేష్, ఊర్మిళ దంపతుల జీవితంలో ఇద్దరి మద్య వైవాహిక విభేదాలు వచ్చాయి. చాలా కాలం ఎవరిపాటికి వాళ్లు వారికి ఇష్టం వచ్చినట్లు జీవించారు.

ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన భార్య

ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన భార్య

ఒకే ఇంట్లో ఉంటున్న ఊర్మిళ, జిగ్నేష్ పటేల్ దంపతులు ఎవరు ఎలా ఉన్నా ఒకరి గురించి ఒకరు పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. నెల క్రితం ఛాతి నొప్పితో భార్య ఊర్మిళ అంకలేశ్వర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో వైద్యులు ఊర్మిళకు చికిత్స చేశారు. అయితే చికిత్స పొందుతున్న ఊర్మిళ చనిపోయింది.

 సైనెడ్ ఇంజెక్షన్ తో చంపేశారు

సైనెడ్ ఇంజెక్షన్ తో చంపేశారు

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఊర్మిళ రెండు రోజులకే మరణించింది. మొదట పోలీసులు ఊర్మిళ అనారోగ్యంతో మరణించిందని అనుకున్నారు. అయితే పోస్టుమార్టుం, ఫోరెన్సిక్ నివేదికలో ఊర్మిళ శరీరంలోకి సైనెడ్ ఇంజెక్షన్ చేశారని వెలుగు చూడటంతో అందరూ హడలిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఊర్మిళకు ఎవరు సైనెడ్ ఎక్కించారు అని ఆరా తీశారు. ఊర్మిళ భర్త జిగ్నేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Recommended Video

    Spl report on Bjym leaders Pragathi Bhavan attack
     నా భార్యను అందుకే చంపేశాను

    నా భార్యను అందుకే చంపేశాను

    ఆసుపత్రిలో ఊర్మిళకు సెలైన్ బాటిల్ ఎక్కించానని, తాను సైనెడ్ నింపిన ఇంజెక్షన్ సైలెన్ లో ఎక్కించానని జిగ్నేష్ అంగీకరించాడని అంకలేశ్వర్ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ వీఎన్. రబరి ఓ ఆంగ్ల దినపత్రికకు చెప్పారు. వైవాహిక విభేదాల కారణంగానే తన భార్య ఊర్మిళను సైనెడ్ ఇంజెక్షన్ తో చంపేశానని జిగ్నేష్ అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేశామని ఇన్స్ పెక్టర్ వీఎన్. రబరి చెప్పారని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సు లేని సమయంలో జిగ్నేష్ సెలైన్ లో సైనెడ్ ఇంజెక్షన్ వేశాడని పోలీసులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+