Wife: బ్యూటీపార్లల్ భార్య, భర్త బ్యాంక్ లోన్ ఏజెంట్, మూడు నెలల ముందే ఇల్లు మార్చి భార్యను చంపి !

సోలాన్/హిమాచల్ ప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ప్రైవేట్ బ్యాంకులో లోన్ ఏజెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం దంపతులు వేరే రాష్ట్రానికి వెళ్లారు. భార్య బ్యూటీపార్లల్ నిర్వహిస్తోంది. దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారని అందరూ అంటున్నారు. ఇద్దరు కుమార్తెలను పిలుచుకుని వెళ్లి బంధువుల ఇంటిలో వదిలిపెట్టిన భర్త ఊరికి వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిపోయాడు. కుమార్తెలను వదిలి వెళ్లిన వ్యక్తి ఆచూకి లేకపోవడంతో ఆయన మొబైల్ నెంబర్ కు బంధువులు ఫోన్ చేశారు. ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో ఇంటికి వెళ్లి చూశారు. బెడ్ రూమ్ లో మంచం మీద భార్య గొంతు చీల్చి దారుణంగా హత్య చేసిన విషయం గుర్తించిన బంధువులు హడలిపోయారు. అదే రూమ్ లో భర్త కూడా సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

ఉత్తరప్రదేశ్ లోని సుల్లాన్ పూర్ కు చెందిన రింకు తివారీ అలియాస్ రింకు (30) అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం ప్రియా భట్ అలియాస్ ప్రియా (26) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రింకూ తివారీ, ప్రియా భట్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రింకూ తివారీ, ప్రియా భట్ దంపతులకు నాలుగు ఏళ్లు, రెండు సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 మూడు నెలల క్రితం మకాం మార్చిన భర్త

మూడు నెలల క్రితం మకాం మార్చిన భర్త

రింకూ తివారీ ఓ ప్రైవేట్ బ్యాంకులో లోన్ ఏజెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం దంపతులు హిమాచల్ ప్రదేశ్ లోని సోలాన్ సమీపంలోని బడ్డి ప్రాంతంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దె ఇల్లు తీసుకుని అక్కడి చేరుకుని కాపురం పెట్టారు. రింకూ తివారీ లోన్ ఏజెంట్ గానే ఉద్యోగం చేస్తున్నాడు.

 బ్యూటీపార్లల్ పెట్టిన భార్య

బ్యూటీపార్లల్ పెట్టిన భార్య

రింకు తివారీ భార్య ప్రియా భట్ బడ్డి ప్రాంతంలో బ్యూటీపార్లల్ నిర్వహిస్తోంది. రింకు తివారీ, ప్రియా భట్ దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారని స్థానికులు అంటున్నారు. ఇద్దరు కుమార్తెలను పిలుచుకుని వెళ్లిన రింకు తివారీ సమీపంలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటిలో వదిలిపెట్టి నలాగఢ్ ఊరికి వెళ్లి సాయంత్రం వచ్చేస్తామని చెప్పి వెళ్లిపోయాడు. కుమార్తెలను వదిలి వెళ్లిన రింకు తివారీ రాత్రి అయినా రాకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు

 బెడ్ రూమ్ లో భార్య, ఫ్యాన్ కు వేలాడుతూ భర్త ?

బెడ్ రూమ్ లో భార్య, ఫ్యాన్ కు వేలాడుతూ భర్త ?

బంధువులు రింకు తివారీ మొబైల్ నెంబర్ కు ఫోన్ చేశారు. రింకు తివారీ ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో అతని ఇంటికి బంధువులు వెళ్లి చూశారు. బెడ్ రూమ్ లో మంచం మీద ప్రియా భట్ గొంతు చీల్చి దారుణంగా హత్య చేసిన విషయం గుర్తించిన బంధువులు హడలిపోయారు. అదే రూమ్ లో రింకు తివారీ కూడా సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.

 భార్య గొంతు కోసి చంపేసిన భర్త

భార్య గొంతు కోసి చంపేసిన భర్త

భార్య ప్రియా భట్ గొంతును కత్తితో కోసి హత్య చేసిన రింకూ తివారి తరువాత ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. సంఘటనా స్థలంలో ఎలాంటి డెత్ నోట్ చిక్కలేదని, రింకు తివారీ అతని భార్య ప్రియా భట్ ను ఎందుకు హత్య చేశాడు, అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? అని కచ్చితంగా తెలియడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+