Newly married: రాత్రి భర్తతో గొడవపడి ఇంటి నుంచి ?, కాళ్లు, చేతులు కట్టేసి నోటిలో ?!

చెన్నై/వేలూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా దంపతులు కాపురం పెట్టారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను ప్రేమికుల మద్య గొడవలు పెద్దవి అయ్యాయి. భర్తతో గొడవపడుతున్న కొత్త పెళ్లి కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి రెండుమూడు రోజుల తరువాత మళ్లీ భర్త ఇంటికి వెలుతోంది. చివరికి భర్తతో గొడవపడి వెళ్లిపోయిన కొత్త పెళ్లికూతురు బావిలో శవమై కనిపించింది. కొత్తపెళ్లికూతురు నొటిలో బట్టలు కుక్కి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి బావిలో విసిరేయడం కలకలం రేపింది.

 ఒకే ఊరిలో లవర్స్

ఒకే ఊరిలో లవర్స్

తమిళనాడులోని వేలూరు జిల్లాలోని పేరణంపట్టణంలోని వీకే నగర్ లో రాజా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాజాకు రాజేశ్వరి అనే కుమార్తె ఉంది. పేరణంపట్టణంలోనే శ్రీధర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల నుంచి రాజేశ్వరి, శ్రీధర్ కు పరిచయం ఉంది. మూడు సంవత్సరాల క్రితం రాజేశ్వరి, శ్రీధర్ ప్రేమలో పడ్డారు.

 మూడు నెలల క్రితం లవ్ మ్యారేజ్

మూడు నెలల క్రితం లవ్ మ్యారేజ్

ప్రేమికులు రాజేశ్వరి, శ్రీధర్ ఇంతకాలం హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ప్రేమికుల కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. పెద్దలు పెళ్లికి అంగీకరిస్తారని ఇంతకాలం ప్రేమికులు ఎదురు చూశారు. అయితే పెద్దలు మాత్రం నో అని చెప్పేశారు. మూడు నెలల క్రితం స్నేహితుల సమక్షంలో రాజేశ్వరి, శ్రీధర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

 కొత్త కాపురంలో గొడవలు

కొత్త కాపురంలో గొడవలు

వివాహం చేసుకున్న రెండు వారాల తరువాత రాజేశ్వరి, శ్రీధర్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను నవదంపతులు రాజేశ్వరి, శ్రీధర్ ల మద్య గొడవలు పెద్దవి అయ్యాయి. భర్త శ్రీధర్ తో గొడవపడుతున్న కొత్త పెళ్లి కూతురు రాజేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. రెండుమూడు రోజుల తరువాత రాజేశ్వరి మళ్లీ ఆమె భర్త శ్రీధర్ ఇంటికి వెలుతోంది.

 ఇంటి నుంచి వెళ్లింది..... అంతే ?

ఇంటి నుంచి వెళ్లింది..... అంతే ?

సాయంత్రం పని ముగించుకుని శ్రీధర్ ఇంటికి వెళ్లాడు. తరువాత రాజేశ్వరి, శ్రీధర్ దంపతుల మద్య గొడవ జరిగింది. తరువాత భర్త శ్రీధర్ తో రాజేశ్వరి గొడవపెంచుకుంది, ఆ సందర్బంలో శ్రీధర్ అతని భార్య రాజేశ్వరిని చితకబాదేశాడని తెలిసింది. భర్త కొట్టడంతో రాజేశ్వరి ఎప్పటిలాగే ఆవేశంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

 బావిలో శవమైన కొత్త పెళ్లికూతురు

బావిలో శవమైన కొత్త పెళ్లికూతురు

భార్య రాజేశ్వరి ఇంటికి తిరిగిరాకపోవడంతో శ్రీధర్ భయపడ్డాడు, వెంటనే రాజేశ్వరి కుటంబ సభ్యులకు ఫోన్ చేశాడు. మా ఇంటికి రాలేదని రాజేశ్వరి తల్లిదండ్రులు శ్రీధర్ కు చెప్పారు. శ్రీధర్ పోలీసు కేసు పెట్టాడు. ఇదే సమయంలో రంగం పేట సమీపంలోని కొక్కలూరు గ్రామంలోని గణపతి అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ బావిలో రాజేశ్వరి శవమై కనిపించింది.

 కాళ్లు, చేతులు కట్టేసి..... ఏం చేశారంటే ?

కాళ్లు, చేతులు కట్టేసి..... ఏం చేశారంటే ?

కొత్తపెళ్లికూతురు రాజేశ్వరి నొటిలో బట్టలు కుక్కి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేసి బావిలో విసిరేయడం కలకలం రేపింది. రాజేశ్వరికి బాగా తెలిసిన వాళ్లే ఆమెను హత్య చేసి ఉంటారని వేలూరు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజేశ్వరి భర్త శ్రీధర్ ను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. రాజేశ్వరితో ఇన్ని రోజులు ఫోన్ లో మాట్లాడిన వారి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+