బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: పోలీసు క్వాటర్స్ లో కానిస్టేబుల్ భార్య ?, పెళి జరిగి రెండేళ్లు కాకముందే ? మూడు నెలల ముందే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ తుమకూరు: పోలీసు ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. అదే జిల్లాలో నివాసం ఉంటున్న యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇద్దరి కులాలు ఒకటే కావడంతో పెళ్లి విషయంలో ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న యువకుడికి పెళ్లి చేసే విషయంలో మొదట ఆమె కుటంబ సభ్యులు ఆలోచించారు. అయితే 20 నెలల క్రితం పోలీసు, ఆ యువతి పెళ్లి జరిగిపోయింది. హ్యాపీగా సంసారం చేస్తున్న దంపతులకు 6 నెలల క్రితం కొడుకు పుట్టాడు. దంపతులు పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్నారు. ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లి వచ్చి చూసే సరికి అతని భార్య పోలీసు క్వాటర్స్ లో ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. కానిస్టేబుల్ మీద బాధితురాలి కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Illegal affair: భర్తకు డేట్ ఫిక్స్ చేసిన భార్య, మ్యాటర్ సెటిల్ చేసిన ప్రియుడు, క్లైమాక్స్ లో రివర్స్ !Illegal affair: భర్తకు డేట్ ఫిక్స్ చేసిన భార్య, మ్యాటర్ సెటిల్ చేసిన ప్రియుడు, క్లైమాక్స్ లో రివర్స్ !

 పోలీసు ఉద్యోగం

పోలీసు ఉద్యోగం

కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన శశిధర్ అనే యువకుడు తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్ళిలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసు ఉద్యోగం చేస్తున్న శశిధర్ కు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు చాలా పెళ్లి సంబంధాలు చూశారు. అయితే శశిధర్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు నచ్చిన అమ్మాయి మాత్రం అంత త్వరగా చిక్కలేదు.

 కులాలు ఒక్కేట కావడంతో చర్చలు

కులాలు ఒక్కేట కావడంతో చర్చలు

తుమకూరు జిల్లాలోని హుళియూరు హుబళి లోని కల్లహళ్ళి గ్రామంలో లావన్య (22) అనే యువతి నివాసం ఉంటున్నది. తుమకూరు జిల్లాలో నివాసం ఉంటున్న లావణ్యకు కొంతకాలంగా పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. శశిధర్, లావణ్య కులాలు ఒకటే కావడంతో పెళ్లి విషయంలో ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు.

 20 నెలల ముందు పెళ్లి

20 నెలల ముందు పెళ్లి

పోలీసు ఉద్యోగం చేస్తున్న శశిధర్ కు లావణ్యను ఇచ్చి పెళ్లి చేసే విషయంలో మొదట ఆమె కుటంబ సభ్యులు ఆలోచించారు. అయితే 20 నెలల క్రితం కానిస్టేబుల్ శశిధర్, లావణ్య పెళ్లి జరిగిపోయింది. చిక్కనాయకనహళ్ళి క్వాటర్స్ లో ఉంటున్న శశిధర్, లావణ్య దంపతులు హ్యాపీగా సంసారం చేస్తున్నారు.

 పోలీసు క్వాటర్స్ లో శవమైన కానిస్టేబుల్ భార్య

పోలీసు క్వాటర్స్ లో శవమైన కానిస్టేబుల్ భార్య

శశిధర్, లావణ్య దంపతులకు 6 నెలల క్రితం కొడుకు పుట్టాడు. కొడుకుతో కలిసి మూడు నెలల పాటు పుట్టింటిలో ఉన్న లావణ్య మూడు నెలల క్రితమే చిక్కనాయకనహళ్ళి పోలీసు క్వాటర్స్ లోని భర్త ఇంటికి వచ్చింది. ఆదివారం శశిధర్ ఉద్యోగానికి వెళ్లారు. రాత్రి ఇంటికి చేరుకుని చూడగా లావణ్య ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త శశిధర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

Dhanush,Aishwarya Rajinikanth Divorce పై RGV సెటైర్స్.. పెళ్లి అనాగరిక ఆచారం | Oneindia Telugu
 అనుమానం ఉందంటున్న అమ్మాయి ఫ్యామిలీ

అనుమానం ఉందంటున్న అమ్మాయి ఫ్యామిలీ

లావణ్య ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలీడం లేదని, ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ కూడా రాసిపెట్టలేదని చిక్కనాయకనహళ్ళి పోలీసు అధికారులు అంటున్నారు. పోలీసు క్వాటర్స్ లో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే లావణ్య ఆత్మహత్యపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

English summary
Wife: Police constables wife commits suicide in police quarters in Tumakuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X