భార్య టీవీ రిమోట్ ఇవ్వలేదని భర్త ఉరేసుకున్నాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

భోపాల్: క్షణికోద్రేకం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య టీవీ రిమోట్ ఇవ్వలేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లో భోపాల్ నగరంలో శనివారంనాడు జరిగింది.

భోపాల్ నగరంలోని అశోక్ గార్డెన్ ప్రాంతానికి చెందిన శంకర్ విశ్వకర్మ ఓ హోటల్ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. శంకర్ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో కలిసి భోజనం చేసి టీవీ చూసేందుకు రిమోట్ అడిగాడు.

Wife refuses to give TV remote, man commits suicide

భార్య టీవీ చూడవద్దని విశ్రాంతి తీసుకోవాలని భర్తను కోరి రిమోట్ ఇవ్వడానికి నిరాకరించింది. దాతంతో భార్య గదిలోకి వెళ్లిన శంకర్ సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

దాదాపు 30 ఏళ్ల వయస్సు గల శంకర్ మద్యానికి బానిస కావడం వల్ల చిన్న విషయానికే ఆవేదన చెందుతాడని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man allegedly killed himself in Bhopal after his wife refused to hand over the TV remote to him, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి