Wife sister: మరదలితో అక్రమ సంబంధం, భార్య, పిల్లలు, అత్తను చంపేసి ఆత్మహత్య, లవర్ !

నాగపూర్/ముంబాయి/చెన్నై: భార్యతో కాపురం చేస్తున్న భర్త పిల్లలకు తండ్రి అయ్యాడు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. బావా మరదలి అక్రమ సంబంధం సాఫీగా సాగిపోతున్న సమయంలో బావకు పిడుగులాంటి వార్త తెలిసింది. తన మరదలు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునిందని తెలుసుకుని గొడవపడటం మొదలు పెట్టాడు. రోజు ఇదే విషయంలో భార్య, మరదలు, అత్తతో గొడవపడుతున్న భర్త రగిలిపోయాడు. అంతే సహనం కోల్పోయిన భర్త అతని భార్య, మరదలు, అత్తతో పాటు అతని ఇద్దరు పిల్లలను హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

హ్యాపీలైఫ్

హ్యాపీలైఫ్

మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లా నాగ్ పూర్ లోని గోలిబార్ చౌక్ లోని బాదల్ కా అఖాడా ఏరియాలో అలోక్ మథుకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నాగ్ పూర్ లోనే నివాసం ఉంటున్న దేవీదాస్ కుమార్తె పెద్ద కుమార్తె విజయతో అలోక్ వివాహం జరిగింది. అలోక్, విజయ దంపతులకు పారి, సాహిల్ ఇనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య విజయ, పిల్లలతో కలిసి అలోక్ సంతోషంగా ఉండేవాడు.

 బావతో అక్రమ సంబంధం

బావతో అక్రమ సంబంధం

విజయకు అమిషా బాబ్డే అనే చెల్లెలు ఉంది. మరదలు అమిషా మీద ఆమె బావ అలోక్ మోజుపడ్డాడు. ఇదే సమయంలో అక్క మొగుడు అలోక్ తో అమిషా అక్రమ సంబంధం పెట్టుకునింది. గుట్టుచప్పుడు కాకుండా అలోక్, అమిషా వ్యవహారం కొంతకాలం సాఫీగా సాగిపోయింది. టైలరింగ్ పని చేస్తున్న అలోక్ అతనికి సహాయం చెయ్యడానికి మరదలు అమీషాను పిలుచుకుని వెళ్లేవాడు.

మరదలికి వేరే వ్యక్తితో లింక్

మరదలికి వేరే వ్యక్తితో లింక్

అమిషాతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆమె గురించి ఓ షాకింగ్ విషయం ఆమె బావ అలోక్ కు తెలిసింది. అమిషా వేరే యువకుడితో తిరుగుతోందని అలోక్ కు తెలిసింది. ఇదే విషయంలో మరదలు అమీషాతో అలోక్ గొడవపడి ఆమెను చితకబాదేశాడు. మూడు నెలల తరువాత అమీషా బావ టైలరింగ్ షాపుకు వెళ్లడం పూర్తిగా మానేసింది.

బావ మీద కేసు పెట్టిన మరదలు

బావ మీద కేసు పెట్టిన మరదలు


మరదలు రానురాను దూరం కావడంతో అలోక్ రగిలిపోయి మరోసారి ఆమెను పట్టుకుని చితకబాదేశాడు. తన బావ తనకు చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అమీషా నాగ్ పూర్ లోని తహసీల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు అలోక్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి అతన్ని చితకబాది ఇంకోసారి ఇలా జరిగితే కేసు పెట్టి జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చి పంపించారు.

భార్య, మరదలు, అత్త, పిల్లలను చంపేసి ఆత్మహత్య

భార్య, మరదలు, అత్త, పిల్లలను చంపేసి ఆత్మహత్య


రాత్రి మద్యం సేవించిన అత్త ఇంటికి వెళ్లిన అలోక్ తరువాత అక్కడే ఉన్న భార్య విజయతో గొడవపెట్టుకున్నాడు. అదే సమయంలో మరదలు అమీషా, ఆమె తల్లిని పట్టుకుని చితకబాదేశాడు. అనంతరం అలోక్ సహనం కోల్పోయి భార్య విజయ, మరదలు అమీషా, అత్తను దారుణంగా పొడిచి చంపేశాడు, ముగ్గురిని చంపేసిన తరువాత పిల్లలు పారి సాహీల్ ను కూడా చంపేశాడు. అందర్ని చంపేసిన కిరాతకుడు అలోక్ నైలాన్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మామ వెళ్లి చూస్తే దారుణం వెలుగు చూసింది

మామ వెళ్లి చూస్తే దారుణం వెలుగు చూసింది

అమీషా తండ్రి దేవీదాస్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన దేవిదాస్ ఐదు మంది హత్యకు గురైన విషయం గుర్తించి గట్టిగా కేకలు వేసి స్థానికులకు విషయం చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

అందర్నీ చంపేసిన కిరాతకుడు

అందర్నీ చంపేసిన కిరాతకుడు

అలోక్ అతని కుటుంబ సభ్యులు అందరిని హత్య చెయ్యడానికి ఆన్ లైన్ లో కత్తులు కొనుగోలు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మరదలు అమీషా వ్యామోహంలో అలోక్ అతని కుటుంబ సభ్యులు అందరిని చంపేసి ఆత్మహత్య చేసుకోవడం నాగ్ పూర్ నగరంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+