Boyfriend: ఇంటి పక్కనే భార్యకు బాయ్ ఫ్రెండ్, వార్నింగ్ ఇచ్చిన భర్త, విసిగిపోయి ఇంట్లో ఏం చేశాడంటే ? !

భోపాల్/ మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న భర్త ఎక్కువగా బయట ఉంటున్నాడు. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న యువకుడితో భార్య చనువుగా ఉంటున్నదని ఆమె భర్తకు తెలిసిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. ఉదయం పిల్లలు స్కూల్ కు వెళ్లారు. మద్యాహ్నం భర్త ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు. నా భార్యను ఎవరో హత్య చేశారని స్థానికులకు చెప్పాడు. పోలీసు కంట్రోల్ రూమ్ 100 నెంబర్ కు ఫోన్ చేసిన భర్త నా భార్యను ఎవరో చంపేశారని, మీరు త్వరగా రావాలని పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తరువాత క్లైమాక్స్ మొత్తం రివర్స్ అయ్యింది.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రాజేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పునియా బాయి సూర్యవంశీ అలియాస్ పునియా బాయి అనే మహిళను రాజేష్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాజేష్, పూనియా బాయి దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు.

ఇంటి పక్కన భార్యకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ?

ఇంటి పక్కన భార్యకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ?

రాజేష్, పునియా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న రాజేష్ ఎక్కువగా బయట ఉంటున్నాడు. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న యువకుడితో తన భార్య పునియా బాయి చనువుగా ఉంటున్నదని, నేను లేని సమయంలో బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకుని తన భార్య ఎంజాయ్ చేస్తోందని రాజేష్ కు అనుమానం పెరిగిపోయింది.

భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త

భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త

అక్రమ సంబంధం ఇదే విషయంలో పునియా బాయి, రాజేష్ దంపతుల మద్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కు దూరం కావాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని రాజేష్ ఇప్పటికే చాలాసార్లు అతని భార్య పునియాకు వార్నింగ్ ఇచ్చాడు. పునియా బాయి మాత్రం ఆమె పద్దతి మార్చుకోకపోవడంతో రాజేష్ రగిలిపోయాడు.

భార్యను పక్కాప్లాన్ తో చంపేశాడు

భార్యను పక్కాప్లాన్ తో చంపేశాడు


ఎంతచెప్పినా నా భార్య పునియా మాట వినడం లేదని, ఆమెను చంపేయాలని రాజేష్ డిసైడ్ అయ్యాడు. కొంతకాలం నుంచి భార్య పునియాను హత్య చెయ్యడానికి రాజేష్ వేచిచూశాడని తెలిసింది. బుధవారం (ఈనెల 14వ తేదీ) ఉదయం పిల్లలు స్కూల్ కు వెళ్లారు. మద్యాహ్నం రాజేష్ అతని భార్య పునియా బాయిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

పోలీసులకు ఫోన్ చేసి బుక్కైపోయిన భర్త

పోలీసులకు ఫోన్ చేసి బుక్కైపోయిన భర్త

భార్యను హత్య చేసిన తరువాత రాజేష్ కొంతసేపు ఇంట్లోనే ఉన్నాడు. తరువాత ఇంటి నుంచి బయటకు పరుగు తీసిన రాజేష్ నా భార్య పునియాను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని స్థానికులకు చెప్పాడు. రాజేష్ స్వయంగా పోలీసు కంట్రోల్ రూమ్ 100 నెంబర్ కు ఫోన్ చేసి నా భార్యను ఎవరో చంపేశారని, మీరు త్వరగా రావాలని రాజేష్ పోలీసులకు చెప్పాడు.

బెండ్ తీస్తే మ్యాటర్ లీక్

బెండ్ తీస్తే మ్యాటర్ లీక్

పోలీసులు ఎంట్రీతో మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది. రాజేష్ పొంతనలేకుండా సమాధానం ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. ఆ సందర్బంలో రాజేష్ అసలు మ్యాటర్ చెప్పాడు. నా భార్య పునియా బాయికి ఇంటి సమీపంలోనే ప్రియుడు ఉన్నాడని, అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని మా పరువు తీస్తోందని నేనే చంపేశానని రాజేష్ అసలు విషయం అంగీకరించాడని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+