శోభనం రోజే భర్తకు షాకిచ్చిన భార్య.. ఇది మరో బాగోతం

ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం, జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు. కానీ, నేడు కొన్ని దారుణ సంఘటనలు ఈ పవిత్ర బంధంపైనే ప్రశ్నలు రేపుతున్నాయి. పెళ్లి పేరుతో మోసం, బెదిరింపులు, హత్యలు, కుట్రలు వంటివి వెలుగుచూస్తుంటే, విస్మయం కలుగుతోంది. తాజాగా ఇండోర్‌లో సోనం తన భర్తను హనీమూన్‌లోనే హత్య చేసిన ఘటన మరువకముందే, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మరో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నిషాద్‌కు ఇటీవల సితార అనే యువతితో పెళ్లి జరిగింది. పెద్దలు ఏర్పాటు చేసిన మొదటి రాత్రి కోసం ఎంతో సంతోషంగా గదిలోకి వెళ్లిన నిషాద్‌కు అక్కడ ఊహించని షాక్ ఎదురైంది. సితార కత్తి పట్టుకుని వచ్చి నన్ను తాకితే 35 ముక్కలుగా చేస్తా అంటూ బెదిరించింది. అంతేకాదు, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అమన్ అనే వ్యక్తిని ప్రేమించినట్లు నిర్మొహమాటంగా చెప్పింది. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్తను, అతడి కుటుంబసభ్యులను బెదిరించింది. దీంతో భయపడిన నిషాద్ రాత్రంతా సోఫాలో నిద్రపోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి మూడు రోజుల పాటు కొనసాగింది.

Wife threatens husband on first night

ఆ తర్వాత నిషాద్ కుటుంబం పంచాయతీ పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. నిత్యం చాకుతో బెదిరిస్తూ భర్తను మానసికంగా హింసించింది. దీంతో నిషాద్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే, సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ అమన్ అనే యువకుడు సితారకు దూరపు బంధువు, వరుసకు మేనల్లుడు కావడం ఈ ఘటనలో మరో విస్మయకరమైన అంశం. పెళ్లి బంధం పవిత్రతను చెరిపేస్తున్న ఇలాంటి సంఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+