మొగుడు వద్దు ప్రియుడే ముద్దు అన్నావ్..ఇప్పుడు చూడు ఆంటీ ఎంత పనైందో..!
కట్టుకున్న భర్తను, పుట్టిన బిడ్డలను కాదనుకుని, ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త , తప్పని ఎంత వారించిన అతని మాట భార్య వినలేదు. దీంతో చేసేది లేక ప్రియుడుకు తన భార్యను ఇచ్చి వివాహం చేశాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ, ప్రియుడును పెళ్లి చేసుకున్న భార్య పట్టుపని పది రోజులు కూడా కాపురం చేయలేకపోయింది. చేసేది లేక తిరిగి భర్త చెంతకు చేరింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన బబ్లూ, రాధిక భార్యాభర్తలు. 2017లో వీరికి పెళ్లికి జరిగింది. వీరి సంసార జీవితం హాయిగా సాగుతోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలోకి మూడో వ్యక్తి ప్రవేశించాడు. అక్కడి నుంచి కథ మొత్తం మారిపోయింది. కుటుంబపోషణ కోసం భర్త తరుచు బయటకు వెళ్లి పనులు చేస్తుండేవాడు. ఇదే అవకాశంగా తీసుకున్న భార్య తమ గ్రామంలోనే తనకంటే వయస్సులో చాలా చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అయితే రాధిక ఎఫైర్ విషయం ఊర్లోని మిగతావాళ్లతో పాటు బబ్లూ కుటుంబానికి తెలిసింది.

భార్య సంబంధం గురించి కుటంబ సభ్యులు భర్త బబ్లూకి తెలియజేశారు. పద్దతి మార్చుకోవాలంటూ భార్య రాధికను హెచ్చరించాడు భర్త. అయితే రాధిక తన ప్రవర్తన మార్చుకోలేదు. ప్రియుడితో తన బంధాన్ని కొనసాగించింది. దీంతో విసిగిపోయిన భర్త , భార్య కోరిక మేరకు ప్రియుడును ఆమెకిచ్చి వివాహం జరిపించాడు. అంతేకాకుండా కోర్టుకి తీసుకెళ్లి తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేశాడు. ఓ నోటరైజ్డ్ అఫిడవిట్ తయారుచేసి తర్వాత రాధికకి ఆమె ప్రియుడితో ఊర్లోని గుళ్లోనే పెళ్లి జరిపించాడు. ఊరు మొత్తం ఈ పెళ్లి చూసింది. ఇద్దరు పిల్లలను తానే సొంతంగా సాకుతానని, తాను ఎంత కష్టమైనా పడి వారికి బాగా చూసుకుంటానని బబ్లూ గ్రామస్థుల ముందు చెప్పాడు. రాధిక కూడా దానికి అంగీకరించింది.

అయితే ప్రియుడిని పెళ్లి చేసుకున్న తర్వాత రాధిక సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ప్రియుడు తల్లి కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, భర్త , పిల్లలను వదిలి రావడం తప్పని రాధికకు నచ్చ చెప్పడంతో ఆమె తిరిగి తన భర్త చెంతకు చేరింది.చేసిన తప్పు తెలుసుకుని తిరిగొచ్చిన భార్యను భర్త బబ్లూ సైతం ఏలుకున్నాడు. భార్య ఇంత పెద్ద తప్పు చేసినా భర్త బబ్లూ ఆమెను స్వీకరించడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications