భార్య అక్రమ సంబంధం: పేరు మాత్రమే రాణి, వక్రబుద్ధి, బిడ్డలకు విషం పెట్టి చంపి, ప్రియుడు జస్ట్ మిస్
చెన్నై/ మదురై: రత్నాలాంటి ఇద్దరు కుమారులతో కలిసి దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న చోట భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త భార్యను మందలించాడు. ఎలాగూ అందరికీ తెలిసిపోయిందని భర్త, పిల్లలను గాలికి వదిలేసిన అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిపోయింది. నీ భార్య పరాయివాడితో వెళ్లిపోయిందని భర్తను చూసినవాళ్లు ఆడిపోసుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన భర్త భార్య ప్రియుడిని కత్తితో పొడిచి ఇద్దరు కొడుకులను హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

రత్నాల్లాంటి ఇద్దరు కొడుకులు
తమిళనాడులోని మదురై జిల్లా పాలమేడులోని బృందానగర్ లో కుమార్ (42), ఉషారాణి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. కుమార్, ఉషారాణి దంపతులకు కుబేర పెరుంచోళన్ (8), సిద్దార్థ్ (6) అనే ఇద్దరు రత్నాలాంటి కుమారులు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వరకు కుమార్, ఉషారాణి దంపతులు కాపురం సవ్యంగానే సాగిపోయింది.

ప్రభుత్వ ఉద్యోగం అని పొగరు
కుమార్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పాలమేడు పట్టణ పంచాయితీలో ఉషారాణి పారిశుద్ద విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నది. తాను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని, నువ్వు చీప్ గా ఆటో డ్రైవర్ అని రెండు సంవత్సరాల నుంచి భర్త కుమార్ తో ఉషారాణి గొడవ చేసేది. ఇదే సమయంలో పట్టణ పంచాయితీలో సీనియర్ అధికారిగా పని చేస్తున్న కనకరాజ్ అనే ఉద్యోగితో ఉషారాణి చనువుగా ఉండటం మొదలుపెట్టింది.

కనకరాజు ఏం చూపించాడో ?
ఉషారాణితో చనువుగా ఉంటున్న కనకరాజు ఆమెను వలలో వేసుకున్నాడు. తరువాత కనకరాజు ఏం చూపించాడో ? ఏమో ? ఉషారాణి అతని వలలో పడిపోయింది. వచ్చే జీతంలో అర్దం డబ్బులు కనకరాజ్ జల్సాలకు తగలేస్తున్న ఉషారాణి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. జీతం డబ్బులు ఏమవుతున్నాయి అని భర్త కుమార్ అడితే నా జీతం, నా ఇష్టం అంటూ ఉషారాణి ఇంట్లో రాక్షసిలాగా ప్రవర్తించేది.

పేరు మాత్రమే రాణి బుద్ది మాత్రం !
కనకరాజు, ఉషారాణి విచ్చలవిడిగా తిరగడంతో ఆ విషయం ఆమె భర్త కుమార్ కు తెలిసింది. నువ్వు పద్దతి మార్చుకోవాలని, ఇద్దరు పిల్లలు ఉన్నారని కుమార్ చాలాకాలం భార్యకు బుద్దిమాటలు చెప్పాడు. పేరుకు మాత్రమే ఉషారాణి, బుధ్దిమాత్రం వక్రబుద్ది కావడంతో ఆమె పద్దతి మార్చుకోలేదు. ఇంట్లో గొడవలు ఎక్కువ కావడంతో మూడు నెలల క్రితం భర్త కుమార్, ఇద్దరు పిల్లలను వదిలేసిన ఉషారాణి ఇంటి నుంచి వెళ్లిపోయి పుట్టింటిలో ఉంటూ కనకరాజ్ తో ఎంజాయ్ చేస్తోంది.

నువ్వు మగాడివేనా ?
నీ భార్య మిమ్మల్ని వదిలేసి వేరే వ్యక్తితో కులుకుతోందని, అసలు నువ్వు మగాడివేనా ? అంటూ బంధువులు, చుట్టుపక్కల వాళ్లు కుమార్ ను ఆడిపోసుకున్నారు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు తనను, తన పిల్లలను చులకనగా మాట్లాడుతున్నారని కుమార్ నెల రోజుల నుంచి తీవ్ర ఆవేదనకు గురైనాడు. ఎలాగైనా భార్యను ఇంటికి పిలుచుకునిరావాలని ప్రయత్నించాడు.

బిడ్డలను చంపి ఆత్మహత్య, ప్రియుడు జస్ట్ మిస్
భార్యను ఇంటికి పిలుచుకుని రావడానికి వీలుకాకపోవడంతో రగిలిపోయిన కుమార్ కత్తి తీసుకుని రోడ్డు మీద వెలుతున్న భార్య ప్రియుడు కనకరాజ్ మీద దాడి చేశాడు. కనకరాజ్ కు తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కనకరాజ్ మీద దాడి చేసిన కుమార్ ఇద్దరు కుమారులను పిలుచుకుని కులదైవం ఆలయానికి వెళ్లాడు. అక్కడ కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇద్దరు కుమారులకు ఇచ్చి అతను తాగాడు. స్థానికులు విషయం గుర్తించి ముగ్గురిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై కుమార్, అతని ఇద్దరు కుమారులు మరణించారని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications