త్వరలో నీ అండర్‌వరల్డ్ సంబంధాలను బయటపెడతా.. నవాబ్ మాలిక్ కు మహా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో మహారాష్ట్రలో మొదలైన రాజకీయ దుమారం చిలికి చిలికి గాలివానగా మారింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఈ డ్రగ్స్ కేసులో మొదట నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను టార్గెట్ చేసి కేంద్ర దర్యాప్తు సంస్థ వెనుక కేంద్రంలోని బిజెపి ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఇక సమీర్ వాంఖడేపై సంచలన ఆరోపణలు చేసి, సమీర్ వాంఖడేపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజిలెన్స్ విచారణకు కారణమైన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై సంచలన ఆరోపణలు చేశారు. నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలకు దేవేంద్ర ఫడ్నవీస్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు
దేవేంద్ర ఫడ్నవీస్ కు డ్రగ్స్ పెడ్లర్ లతో లింకులు ఉన్నాయన్న నవాబ్ మాలిక్
నవాబ్ మాలిక్ డ్రగ్స్ తో బీజేపీ లింకులని సంచలన పోస్ట్ పెట్టారు. 2018లో అమృత ఫడ్నవీస్ నది గీతం ప్రాజెక్ట్ రికార్డింగ్ సమయంలో జయదీప్ రాణా తో కలిసి తీసిన ఒక ఫోటో ట్వీట్ చేసి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కు నది గీతం ప్రాజెక్ట్ ఫైనాన్స్ హెడ్ జయదీప్ రాణా అని నవాబ్ మాలిక్ తెలిపారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన జయదీప్ రాణాకు దేవేంద్ర ఫడ్నవీస్ తో సంబంధాలున్నాయని, బీజేపీతో డ్రగ్స్ లింకులు బయట పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నవాబ్ మాలిక్.

ఆ ఫోటోలకు వివరణ ఇచ్చిన ఫడ్నవీస్ .. డ్రగ్స్ ఆరోపణల ఖండన
మాదక ద్రవ్యాల వ్యాపారి జయదీప్ రాణా మరియు దేవేంద్ర ఫడ్నవీస్‌ల ఫోటోను మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ట్వీట్ చేసిన తర్వాత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డ్రగ్స్ వ్యాపారి జయదీప్ రాణాతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని ఖండించారు. విలేకరుల సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, నవాబ్ మాలిక్ ట్వీట్ చేసిన ఫోటోలు రివర్ మార్చ్ అనే సంస్థ ద్వారా నియమించబడిన వ్యక్తికి సంబంధించినవని, అతను తన భార్యతోనూ, తనతోనే కాదు అందరితో ఫోటోలు దిగాడని దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. ఫోటోలు దిగినంత మాత్రాన సంబంధాలు ఉన్నట్టా అని ప్రశ్నించారు.
తన భార్య ఫోటో పెట్టి టార్గెట్ చేస్తున్నారని మండిపడిన దేవేంద్ర ఫడ్నవీస్
తన భార్య సోషల్ ఫీల్డ్‌లో పని చేస్తుంది, ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కాబట్టి వారు తనపై దాడి చేయలేక, తన భార్యను టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. అయినా తాము నవాబ్ మాలిక్ ఆరోపణలకు సమాధానం ఇచ్చి తీరుతామని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. అండర్ వరల్డ్‌తో నవాబ్ మాలిక్‌కు ఉన్న సంబంధాలను త్వరలో బయటపెడతానని బీజేపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అండర్ వరల్డ్‌తో సంబంధాలున్న వారు ఈ తరహాలో మాట్లాడకూడదన్నారు.
నవాబ్ మాలిక్ కు అండర్‌వరల్డ్‌తో ఉన్న సంబంధాలను బయటపెడతా.. ఫడ్నవీస్ సంచలనం
త్వరలో మాలిక్‌కు అండర్‌వరల్డ్‌తో ఉన్న సంబంధాలను బయటపెడతానని.. అతను గేమ్‌ను ప్రారంభించాడని, దీపావళి వరకు ఆగండి ఆపై తాను గేమ్ ను కొనసాగిస్తానని దేవేంద్ర ఫడ్నవీస్ నవాబ్ మాలిక్ పై ఎదురు దాడి చేశారు. త్వరలోనే ఇంతకుముందు వెలుగులోకి రాని అనేక విషయాలు బయటకు తీసుకు వస్తానని,తానెప్పుడు రుజువులు లేకుండా మాట్లాడానని, ఆరోపణలు చేసి ఉపసంహరించుకున్న పేరు తనకు లేదని దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.
నవాబ్ మాలిక్ అల్లుడి కోసమే ఇదంతా చేస్తున్నాడు
నవాబ్ మాలిక్ ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా తన అల్లుడిపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. డ్రగ్స్ కేసులో నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌ను ఈ ఏడాది జనవరి 13న ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. ఎనిమిది నెలల జైలు శిక్ష తర్వాత సమీర్ ఖాన్‌కు సెప్టెంబర్ 27న బెయిల్ మంజూరైంది. తాజాగా ఆర్యన్ ఖాన్ కేసు రగడ మహారాష్ట్రలో రాజకీయంగా రచ్చకు కారణంగా మారింది. ముందు ముందు ఈ వ్యవహారంలో మరెంత మాటల దాడి కొనసాగానుందో వేచి చూడాలి.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications