వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రతకు ముప్పుగా మారితే దేశమైనా, విదేశమైనా దాడులే- చైనా, పాక్‌పై దోవల్‌ నర్మగర్భ వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

దేశభద్రతకు ముప్పుగా పరిణమించే ఏ భూభాగంపైనైనా దాడులకు మనం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ విస్పష్టంగా ప్రకటించారు. అది దేశంలో భూభాగమైనా, విదేశీ భూభాగమైనా తాము పట్టించుకోబోమని దోవల్‌ తాజాగా పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.

Recommended Video

: India Will Fight On Our Soil As Well As On Foreign Soil: NSA Ajit Doval|New India

భారత్‌ ఎప్పుడూ శత్రుదేశాలపై తొలి దాడి చేయబోదని, వారు దాడికి దిగితే మాత్రం గట్టి సమాధానం ఇచ్చి తీరుతుందని దోవల్‌ వ్యాఖ్యానించారు. రిషికేష్‌లోని పరమర్త్‌ నికేతన్‌ ఆశ్రమ్‌ను సందర్శించిన సందర్భంగా మాట్లాడిన దోవల్‌.. జాతీయ భద్రత విషయంలో రాజీ పడేందుకు సిద్ధంగా లేమన్నారు. న్యూ ఇండియా అంశంపై మాట్లాడిన ఆయన... భారత్‌కు శత్రువులు తయారవుతున్న ఓ భూభూగాన్ని వదిలిపెట్టబోమన్నారు. అయితే దోవల్‌ వ్యాఖ్యలు ఏ ఒక్కరినీ నేరుగా ఉద్దేశించనవి కావని అధికారవర్గాలు తెలిపాయి.

Will fight on our soil as well as on foreign soil, says nsa ajit doval

భారత్‌ ఓ నాగరిక దేశమని, ఇక్కడ మతం, భాష వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యం లేదని, సంస్కృతి పునాదులపైనే ఈ దేశం నిర్మితమైందని అజిత్‌ దోవల్‌ తెలిపారు. వాటిని కాపాడుకునేందుకే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మరోవైపు చైనా, పాకిస్తాన్‌పై దాడికి కేంద్రం ముహుర్తం నిర్ణయించిందంటూ యూపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో అజిత్‌ దోవల్‌ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన వెళ్లింది ఆశ్రమానికే అయినా చేసిన హెచ్చరికలు చూస్తుంటే శత్రుదేశాలనుద్ధేశించే అని భావిస్తున్నారు.

English summary
national security advisor ajit doval says that india will fight not only on its own soil and also on foreign soil which becomes the source of security threat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X