పంజాబ్‌లో తమ ప్రభుత్వం కొలువుదీరుతుంది: ఖట్టర్‌తో అమరీందర్ సింగ్ భేటీ
పంజాబ్ ఎన్నికలు అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా ప్రెస్టేజీగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం అమరీందర్ సింగ్ ధీమాతో ఉన్నారు. అయితే అతను బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయన సోమవారం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు.

ప్రభుత్వం ఏర్పాటు..
దేవుడి కరుణిస్తే.. బీజేప, ఎస్ఏడీ సంయుక్త్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అమరీందర్ సింగ్ తెలిపారు. అమరీందర్ పార్టీలో చేరికల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే తమ పార్టీ చేరిక అంశం చక్కగా సాగుతుందని వివరించారు. ప్రస్తుతం అంతా బాగుందని.. ప్రజలు తమకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి బిల్లు ఆమోదం తెలిపిన రోజే ఖట్టర్-అమరీందర్ మీట్ అయ్యారు.

కాఫీ తాగా..
ఖట్టర్‌తో రాజకీయాలు ఏమీ మాట్లాడలేదని అమరీందర్ తెలిపారు. కాఫీ తాగి.. ఇతర అంశాలు డిస్కష్ చేశామని వివరించారు. తాను ఎవరినీ కలిసిన రాజకీయాలు మాట్లాడనని.. ఖట్టర్ గౌరవార్థం కలిశానని చెప్పారు. ఖట్టర్‌తో సీట్ల పంపకం గురించి మాట్లాడారా అని ప్రశ్నిస్తే.. ఆ అంశం తాను ఢిల్లీ వెళ్లి మాట్లాడతానని చెప్పారు. కొద్దీ రోజుల్లో పార్టీ సింబల్ వస్తోందని.. ఆ తర్వాత తన పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తానని వివరించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ 10 రోజుల క్రితమే మొదలయ్యిందని చెప్పారు.

7 అంశాలు
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంపై అమరీందర్ సింగ్ స్పందించారు. రైతులు మరో ఏడు అంశాల గురించి ప్రస్తావించారని తెలిపారు. వాటిని పరిష్కరిస్తానని కేంద్రం తెలిపిందని వివరించారు. ఇక సమస్యులు ఏమీ లేవని ఆయన చెప్పారు. రైతులపై నమోదై క్రిమినల్ కేసులను కేంద్రం వెనక్కి తీసుకుంటుందని చెప్పారు. ఒకవేళ కేంద్రం.. వాటిని చూడాలని రాష్ట్రాలను కోరితే.. పంజాబ్, హర్యానా పరిష్కరించే ప్రయత్నం చేస్తాయని చెప్పారు.

చర్చలు జరపలే
రైతు నేతలతో సంప్రదింపులు జరపలేదని అమరీందర్ తెలిపారు. కానీ కొందరు తనతో టచ్‌లో ఉన్నారని వివరించారు. ఇప్పటికే వారి డిమాండ్లు అన్నింటినీ పరిష్కరిస్తానని కేంద్రం చెప్పిందని తెలిపారు. పంజాబ్ కాంగ్రెస్‌లో ఉదయం ఒకలా, సాయంత్రం ఒకలా జరుగుతుందని.. సిద్దూను ఉద్దేశించి కామెంట్ చేశారు. దాని గురించి తాను మాట్లాడలేనని వివరించారు.












Click it and Unblock the Notifications