• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే భార్య చేయి నరికేశాడు: అయినా లక్ష్యం వైపే, అండగా ఉంటామన్న సీఎం

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తన భార్య చేయి నరికేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కలకలం రేపింది. ఆ మూర్ఖుడి దాడిలో చేయి కోల్పోయినా.. ఆమె మాత్రం తన ఆశయాన్ని వీడలేదు. కుడి చేయి లేదని నిరాశ చెందని బాధితురాలు రేణు ఖాతున్(23)​.. నర్సు ఉద్యోగం కోసం ఎడమ చేతితో రాయటం సాధన మొదలు పెట్టింది.

రేణు ఖాతూన్‌కు సీఎం మమతా పరామర్శ

రేణు ఖాతూన్‌కు సీఎం మమతా పరామర్శ

తాజాగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్న బాధితురాలిని పరామర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆమెకు అనువైన ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. ఆమె వైద్య ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
తూర్పు బుర్ద్వాన్​ జిల్లాలోని కేతుగ్రామ్‌కు ​కు చెందిన బాధితురాలు రేణు ఖాతున్​.. నర్సు ఉద్యోగానికి ఎంపికైంది. ఇప్పుడు ఆమె కుడి చేతిని కోల్పోయింది. ఆమెకు అనువైన ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తాం. రేణు ఖాతున్​ చికిత్సను చీఫ్​ సెక్రెటరీ హెచ్‌​కే ద్వివేదీ పర్యవేక్షిస్తారు. బాధితురాలికి కృత్రిమ చేయి అందించేందుకు కృషి చేస్తామని మమతా బెనర్జీ తెలిపారు.

నిందితులను శిక్షించాలంటూ బాధితురాలు

నిందితులను శిక్షించాలంటూ బాధితురాలు

తనను పరామర్శించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు రేణు ఖాతున్. బిడ్డ కోసం ఒక తల్లిలా.. ఈరోజు తనకు మద్దతుగా నిలిచారన్నారు. తనను ఈ విధంగా మార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరారు. రేణు ప్రస్తుతం దుర్గాపుర్​ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం అందించే ఆరోగ్య కార్డు ఉన్నప్పటికీ వైద్యం కోసం ఆమె కుటుంబం రూ.57వేలు వెచ్చించాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమత.. వైద్య ఖర్చులు చెల్లించాలని చీఫ్​ సెక్రెటరీకి సూచించారు. కాగా, రేణు ఖాతున్​ భర్త షరిఫుల్​ షేక్‌​తో పాటు ఈ సంఘటనకు సంబంధం ఉన్న అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్​ చేసినట్లు ఎస్​డీపీఓ కౌశిక్​ బసక్​ తెలిపారు.

ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని చెబితే.. చేయి నరికేశాడు

ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని చెబితే.. చేయి నరికేశాడు

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. షేర్​ మహమ్మద్, రేణు ఖాతున్​ భార్యాభర్తలు. రేణు.. దుర్గాపుర్‌​లోని ప్రైవేట్ నర్సింగ్ హోం​లో నర్సింగ్ శిక్షణ తీసుకుండేది. ఈ మధ్యే ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో పాసై ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆమె ఉద్యోగం చేయడానికి భర్త, నిందితుడు షేర్​ మహమ్మద్ అంగీకరించలేదు. దీంతో ఇరువురి దంపతుల మధ్య వివాదాలు వచ్చాయి. ఆ సమయంలోనే భార్యపై కోపంతో పదునైన ఆయుధంతో ఆమె కుడి చేయిని నరికేశాడు. దీంతో రక్తపు మడుగులో ఉన్న రేణుని ఆస్పత్రిగా తరలించగా వైద్యులు ఆమె చేయిని తొలగించి వైద్యం చేశారు. కాగా, చేయి నరికేసి.. తిరిగి దాన్ని అతికిస్తారేమోనని ఆ తెగిపడిన చేయి భాగాన్ని నిందితుడు దాచేయడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడితోపాటు అతనికి సహకరించినవారిని అరెస్ట్ చేశారు.

English summary
will get a govt job: Mamata Banerjee meets Renu Khatun, who lost her hand in attack of her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X