బీజేపీపై పోరాడేందుకు జైలుకు వెళ్లేందుకు రె‘ఢీ’ .. కమలదళంపై దీదీ ఫైర్
కోల్‌కతా : బీజేపీ, ఆ పార్టీ విధానాలను టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వ్యక్తి స్వేచ్చను హరిస్తోందని మండిపడింది. ఫాసిస్టు పాలనకు చరమగీతం పాడాలని .. వచ్చే బెంగాల్ ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ది చెప్తారని అభిప్రాయపడింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే దాడులు చేస్తున్నారని మండిపడింది.

Recommended Video
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తప్పుపట్టారు. మోడీ హయాంలో ప్రతిపక్షాలు నోరు తెరువొద్ద అని ప్రశ్నించారు. రాజ్యాంగ సంస్థలు ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉండిపోయాయని విమర్శించారు. కోల్ కతాలో బుధవారం బహిరంగ సభలో మమతా బెనర్జీ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమని స్పష్టంచేశారు. ఇవాళ తన సోదరులు జైళ్లో ఉన్నారని .. వారు పోరాడేందుకు రావాలని తనను పిలవొచ్చు .. రేపు నేను జైళ్లో ఉంటే వారిని పిలుస్తాను అని చెప్పారు. అంతే తప్ప బీజేపీ విధానాలపై తానేప్పుడు ఆమోదించబోనని తేల్చిచెప్పారు. వారికి ప్రణమిల్లబోనని స్పష్టంచేశారు. ఒకవేళ తాను జైలుకి వెళితే .. అదీ కేవలం దేశాన్ని బీజేపీ కబందహస్తాల నుంచి కాపాడటమేనని తేల్చిచెప్పారు. తనకు మరో రెండేళ్ల సమయం ఇవ్వాలని ... వారిపై పోరాడుతానని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications