దేశంలో ఏ ఒక్క వలసదారునికి చోటు లేదు, ఎన్ఆర్సీ జాబితా సక్రమమేనన్న అమిత్ షా
డిస్పూర్ : దేశంలో ఏ ఒక్క వలసదారుడుకి చోటు లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జాతీయ పౌరసత్వ రిజిష్టార్ (ఎన్ఆర్‌సీ)లో అర్హులకు మాత్రమే చోటు లభించిందని .. అనర్హులు ఒక్కరు కూడా లేరని స్పష్టంచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ అంవంపై రాజకీయ దుమారం నెలకొన్న నేపథ్యంలో అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ నార్త్ ఈస్ కౌన్సిల్ (ఎన్ఈసీ) 68వ ప్లీనరీ సమావేశం ఆదివారం అసోంలో జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్సీ జాబితాపై కొందరు మెమోరాండం సమర్పించారు. మరికొందరు వివాదాస్పదంగా ఉందని, తమ పేర్లు లేవని అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై బీజేపీ అసోం అధ్యక్షుడు రంజిత్ దాస్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టు దేశంలో ఒక వలసదారుడు ఉండేందుకు అనుమతించబోమని తేల్చిచెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే తమకు బీజేపీ చీఫ్ అమిత్ షా దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. 1971కి ముందు దేశంలోకి వచ్చిన వారికి అన్నివిధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. వారిని తమ దేశ పౌరులలాగానే చూస్తామని సంకేతాలిచ్చారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications