టీ బిల్లును ఆమోదిస్తాం: హోం శాఖ సహాయ మంత్రి సింగ్
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు అర్థమవుతోంది. ఏ విధంగానైనా తెలంగాణ బిల్లును ఆమోదింపజేయాలనే ధృఢనిశ్చయంతో ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్‌పిఎన్ సింగ్ స్పష్టం చేశారు. గందరగోళం మధ్య బిల్లును ఆమోదింపజేయాల, వ్దదా అనే విషయంపై స్పీకర్ మీరా కుమార్ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.
చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, అయితే సీమాంధ్ర నేతలు, ప్రతిపక్ష నేతలు చర్చకు సిద్ధంగా లేనప్పుడు కేంద్రం ప్రభుత్వం ఏం చేయగలుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి తమ చిత్తశుద్ధిని నిలబెట్టుకున్నామని సింగ్ చెప్పారు.

ఇదిలావుంటే, తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చకు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పార్లమెంటు పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు డిసిపి త్యాగి తెలిపారు.
రాంలీలా మైదానం, జంతర్‌మంతర్ మిన హా ఇతర ప్రాంతాల్లో ఆందోళనలను నిషేధించినట్లు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications