Rajinikanth: రజినీకాంత్‌ను కెలికారు..ఇక విజయ్‌కు చుక్కలే..నాటి సీన్ రిపీట్..!!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ సెగలు అప్పుడే మొదలయ్యాయి. అగ్ర పార్టీలైన డీఎంకే,ఏఐఏడీఎంకే వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోగా,అందరి దృష్టి మాత్రం తలైవా రజినీకాంత్ వైపు మళ్లింది.నేరుగా రాజకీయాల్లో లేకపోయినా,ఆయన ఇచ్చే ఒక్క పిలుపు ఓటర్ల తీర్పును తలకిందులు చేయగలదని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
1996లో రజినీ ఏం చేశారు..?
రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ ఒక ఉదాహరణ చెబుతుంటారు. 1996 ఎన్నికల సమయంలో అప్పటి ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజినీకాంత్ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం భారీ ఓటమిని మూటగట్టుకోవడంలో రజనీ మద్దతు ఉన్న డీఎంకే-టీఎంసీ (మూపనార్) కూటమి ఘనవిజయం సాధించింది.ఇప్పుడు 2026లో కూడా అటువంటి ప్రభావమే ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.

రజనీ కోసం డీఎంకే పావులు
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అధికార డీఎంకే క్యాంప్ ఇప్పటికే రజినీకాంత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.1996 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ,ఈసారి కూడా తమకు అనుకూలంగా ఒక్క వాయిస్ వినిపించాలని వారు కోరుతున్నట్లు సమాచారం.ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోయినా,కనీసం నైతిక మద్దతు ఇచ్చినా అది తమకు ప్లస్ అవుతుందని డీఎంకే భావిస్తోంది.
బీజేపీ నిశ్శబ్ద ప్రయత్నాలు..
మరోవైపు బీజేపీ కూడా రజినీకాంత్ మద్దతు కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.రజినీకాంత్ ఆధ్యాత్మిక దృక్పథం,జాతీయవాదం పట్ల ఆయనకున్న అనుకూల ఆలోచనలు తమకు కలిసి వస్తాయని బీజేపీ ఆశిస్తోంది.దీనికి తోడు రజినీకాంత్ మాజీ రాజకీయ సలహాదారు అర్జున్ మూర్తి ఇప్పుడు బీజేపీలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.
రజనీ మక్కల్ మంద్రం - అసలైన బలం
రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ,ఆయన అభిమాన సంఘాల నెట్‌వర్క్ రజనీ మక్కల్ మంద్రం క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉంది.తమిళనాడులో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఈ నెట్‌వర్క్ ఓట్లను సమీకరించగలదని నమ్ముతున్నారు.2026లో పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని వందల ఓట్లు కూడా కీలకం కానున్నాయి,ఆ సమయంలో రజనీ అభిమానుల ఓట్లు విజేతను నిర్ణయించవచ్చు.
విజయ్ పార్టీ రజినీకాంత్‌ను అనవసరంగా గెలికిందా..?
రాజకీయాల్లో ఎప్పుడు హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. సరిగ్గా విజయ్ పార్టీ విషయంలో కూడా ఇదే జరిగింది. తమిళనాడులో రజినీకున్న ఫ్యాన్ బేస్ ఏంటో తెలియనిది కాదు. అది తెలిసి మరీ ఆయన్ను గుచ్చడంతో రజినీ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. రజినీకాంత్ పొలిటికల్ పార్టీ పెట్టాలని భావిస్తున్న తరుణంలో డీఎంకే ఆయన్ను బెదిరించడంతో వెనక్కి తగ్గారంటూ టీవీకే జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో వెంటనే క్షమాపణ చెప్పాలంటూ రజినీకాంత్ అభిమానులు డిమాండ్ చేయడమే కాకుండా పలు చోట్ల పోస్టర్లను సైతం అంటించారు.
సాధారణంగా రజినీకాంత్ ఎప్పుడూ తొందరపడి ఒక మాట వదలరు. అంతేకాదు వివాదాలకు చాలా దూరంగా ఉంటూ సైలెంట్‌గా ఉంటారు. కానీ ఈ సారి మాత్రం ఆయన "కాలమే సమాధానం చెబుతుంది"అంటూ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. దీంతో రజినీకాంత్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో అనే అంశ తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ ఒక కీలక శక్తి అనడంలో సందేహం లేదు.అధవ్ అర్జున వ్యాఖ్యలు ఆయనను రెచ్చగొట్టాయో లేక ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్లాయో కానీ,సూపర్ స్టార్ స్పందన మాత్రం రాజకీయ హీట్‌ను అమాంతం పెంచేసింది.మరి 2026లో 'తలైవా'ఎవరి వైపు నిలబడతారు?ఆయన మౌనం ఎవరికి లాభం?ఆయన మాట ఎవరికి శాపం?దీనికి కాలమే సమాధానం చెప్పాలి.












Click it and Unblock the Notifications