వ్యవసాయ చట్టాలు రద్దు చేయకుంటే రాజీవ్ ఖేల్ రత్న వాపస్ చేస్తా: విజేందర్ సింగ్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలుకుతున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, ప్రముఖ బాక్సర్, ఒలింపిక్ విజేత విజేందర్ కూడా ఈ జాబితాలో చేరారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుంటే తనకు ఇచ్చిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని విజేందర్ సింగ్ చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఆదివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. రైతుల ఆందోళనలో పాల్గొన్న విజేందర్ సింగ్.. అవార్డు వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు.

కాగా, ఇప్పటికే పంజాబ్, హర్యానాకు చెందిన పలువురు క్రీడాకారులు రైతుల ఆందోళనకు మద్దతుగా తమ పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా రైతుల ఆందోళనలకు మద్దతుగా తన పద్మవిభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు.
Recommended Video
ఇక వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ రైతులు డిసెంబర్ 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు మద్దతు తెలిపాయి. కాగా, రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ.. సఫలం కాలేదు. దీంతో మరోసారి చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications