Supreme Court: భార్యతో దురుసుగా ప్రవర్తిస్తే అండమాన్ జైలుకే..
Supreme Court:దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో గృహ హింస, విడాకులకు సంబంధించిన అనేక కేసులు వస్తున్నాయి. కానీ సర్వత్రా చర్చనీయాంశమవుతున్న గృహ హింస కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గృహ హింసను ఎదుర్కొంటున్న భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ జంటను తిరిగి కలిపే ప్రయత్నంలో భాగంగా కోర్టు భర్తను హెచ్చరించింది.అతను తన భార్యతో దురుసుగా ప్రవర్తిస్తే.. అతడిని దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన అండమాన్ జైలుకు పంపుతామని, ఏ కోర్టు కూడా అతనికి బెయిల్ మంజూరు చేయదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో భర్త మంచి ప్రవర్తనకు సంబంధించిన అఫిడవిట్ కూడా దాఖలు చేశాడు.
ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ కు చెందిన మహిళకు సంబంధించిన గృహ హింస కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ ఎన్కే సింగ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో తాను, తన భర్త కలిసి ఉన్నప్పుడు తాను ఎలా హింసించబడ్డానో ఆ మహిళ చెప్పింది. తన భర్తతో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని ఆమె ధర్మాసనం ముందు చెప్పింది. కోర్టులో ఆ మహిళ మాట్లాడుతూ.. తన భర్త తన దహనం చేసి చంపడానికి కూడా ప్రయత్నించాడని.. కానీ ఇతరుల జోక్యంతో కాను రక్షించబడ్డానని చెప్పింది. మళ్లీ తన భర్తతో వెళ్తే.. నన్ను చంపేస్తాడని.. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది.. నా ఇద్దరు చిన్నపిల్లలను ఎవరు చూసుకుంటారని.. ఆ మహిళ న్యాయమూర్తిని ప్రశ్నించింది.

అనంతరం న్యాయమూర్తి ఆ భర్తను హెచ్చరించారు. "ఎప్పుడైనా దుష్ప్రవర్తనకు సంబంధించి ఒక్క ఫిర్యాదు వచ్చినా మిమ్మల్ని అండమాన్ జైలుకు పంపుతాము. ఏ కోర్టు కూడా మీకు బెయిల్ ఇవ్వకూడదని కూడా ఆదేశిస్తాం."అని న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఎవరినైనా పెళ్లి చేసుకుంటే భార్యను గౌరవంగా చూసుకోవడం కూడా మీ బాధ్యత అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. మీ భవిష్యత్ మీ భార్య ఇచ్చే సత్ప్రవర్తన సర్టిఫికెట్ పై ఆధారపడి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఆ మహిళకు పూర్తి రక్షణ కల్పిస్తామని బెంచ్ హామీ ఇచ్చింది. సంబంధిత పోలీసు అధికారి ప్రతిరోజూ ఆ ఇల్లాలి స్టేట్ మెంట్లను డైరీలో రాసి.. 15 రోజుల తర్వాత ఆ డైరీని కోర్టులో సమర్పించాలని ఆదేశించబడింది.












Click it and Unblock the Notifications