జియో గిగా ఫైబర్‌లో విడుదల రోజే సినిమా ఆప్షన్: ఇక సినిమా హాళ్లు బందేనా..?
ఇప్పటికే టెలికాం రంగంలో అడుగుపెట్టి ఇతర ప్రధాన టెలికాం ఆపరేటర్ల లాభాలకు కళ్లెం వేసిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆ సంస్థ అధినేత ముఖేష్ అంభాని ప్రకటించారు. జియో గిగా ఫైబర్ సేవలు సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అంబానీ తెలిపారు. ఈ ప్లాన్ ధరలు రూ.700 నుంచి రూ. 10వేలు వరకు ఉండనున్నట్లు తెలిపారు. వినియోగదారుడు సెలెక్ట్ చేసుకున్న ప్లాన్‌ను బట్టి స్పీడ్ ఉంటుంది. అంటే 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ స్పీడు ఉంటుంది. జియో ఫైబర్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న కస్టమర్లకు అనేక ఆఫర్లను ప్రకటించింది జియో సంస్థ. అయితే అంబానీ ప్రకటించిన ఆఫర్లు ఒకలా ఉంటే... విడుదలైన సినిమా తొలిరోజే తొలిఆటలోనే వీక్షించొచ్చు అన్న ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

విడుదలైన రోజే గిగా ఫైబర్‌లో కొత్త సినిమా
డిజిటల్ రంగంలో సంచలనాలకు కేరాఫ్‌గా మారుతోంది రిలయన్స్ సంస్థ. ఇప్పటికే టెలికాం రంగంలో అత్యంత తక్కువ ధరకే డేటా ప్లాన్లు ఉచిత వాయిస్ కాలింగ్‌లు ఆఫర్ ఇచ్చి అప్పటి వరకు టెలికాం రంగాన్ని ఏలిని ఆపరేటర్లకు ఒక్కసారిగా నిద్ర పట్టినివ్వకుండా చేసింది. దేశంలోని సగానికిపైగా మొబైల్ వినియోగదారులు జియో కస్టమర్లుగా మారిపోయారు. తాజాగా జియో ఫైబర్‌ను లాంచ్ చేయనున్నట్లు అంబానీ ప్రకటించారు. ఇది లాంచ్ అయ్యాకా విడుదలైన తొలిరోజే సినిమా అనే కాన్సెప్ట్ గురించి చెప్పారు. దీంతో చర్చ మరోవైపు మళ్లింది. తొలిరోజు తొలిసినిమా చూడొచ్చు అని అంటున్నారంటే ఇక సినిమా హాళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న చర్చనీయాంశమైంది. అంతేకాదు సినిమా తీసిన నిర్మాతల పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

జియో సినిమా కాన్సెప్ట్‌తో థియేటర్లు బందేనా..?
జియో ఫైబర్ ద్వారా ఇలాంటి ఆఫర్ అందిస్తే ప్రజలు ఇక సినిమా చూసేందుకు సినిమా హాళ్లకు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో థియేటర్ యాజమాన్యాలు నష్టాల చవిచూడాల్సి వస్తుంది. అంటే ఇది అమలవుతే ఒకరకంగా థియేటర్ యజమానుల పొట్టకొట్టినట్లే అవుతుంది. ఇది వచ్చే ఏడాది మధ్యలో ఈ ప్లాన్‌ను రోల్ అవుట్ చేస్తామని అంబానీ తెలిపారు. ఇది గిగా ఫైబర్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని చెప్పిన అంబానీ... ఇకపై ఇంట్లోనే కూర్చుని హాయిగా సినిమా వీక్షించొచ్చని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ గృహాలకు జియో ఫైబర్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు అంబానీ. ఇప్పటికిప్పుడు పెద్దగా మార్పులు ఏమీ చూడకపోవచ్చు. కానీ కాలక్రమంలో సినిమాహాళ్లు ఇక ఉండవనేది అర్థం అవుతోంది. అంటే సినిమా హాలే మీ ఇంటికి వస్తుందని అంబానీ చెబుతున్నారు.

సినిమా విడుదల సమయానికే జియో గిగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో వస్తుంది
ఇంకా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ ... ఇప్పటికి అంబానీ ప్రకటన చూస్తే మాత్రం దీన్ని కచ్చితంగా అమలు చేస్తారనే తెలుస్తోంది. అంటే ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమా జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్యాకేజ్‌పై వచ్చేస్తుంది. అది కూడా సినిమా ఏ సమయానికైతే విడుదలవుతోందో... అదే సమయానికి జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్‌పై వస్తుంది. మీకిష్టమైన సమయంలో మీరు సినిమాను వీక్షించే వెసులుబాటు ఉంటుంది. అయితే ఎలాంటి సినిమాలు అంటే బాలీవుడ్ సినిమాలా లేక ప్రాంతీయ సినిమాల లేక హాలీవుడ్ సినిమాలా అన్నదానిపై స్పష్టత లేదు. ఇక ముఖేష్ అంబానీ చేసిన ఈ ప్రకటనతో అప్పుడే సినిమా హాళ్ల యాజమాన్యాలకు, కేబుల్ కంపెనీలకు, డీటీహెచ్ ఆపరేటర్లకు, టీవీ ఛానెళ్ల యాజమాన్యాలకు ఒక్కింత భయాన్ని పుట్టించింది.
మొత్తానికి ముఖేష్ అంబానీ అడుగుపెట్టిన ప్రతిచోటల్లా పరిస్థితి బంగారంలా మారుతోంది. జియోతో టెలికాం రంగంలోకి అడుగుపెట్టడంతో ఇతర ఆపరేటర్లు తమ ధరలను తగ్గించుకునే పరిస్థితికి వచ్చాయి. తాజాగా ఇంట్లోనే కూర్చుని విడుదలైన సినిమా తొలిరోజే చూసే ఆప్షన్ నిజమైతే ఇక మల్టీప్లెక్సులు సైతం టికెట్ ధరలను తగ్గించక తప్పదు. లేదంటే ఆ సినిమా హాళ్లన్నీ నష్టాలతో మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications