బ్రేవ్ స్త్రీ: టీజ్ చేసిన నాయకుడికి షాకిచ్చింది, కారు బానెట్ పైకి ఎక్కి..

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ ధైర్యం ప్రదర్శించింది. అదీ ఓ రాజకీయ నాయకుడి ఎదుట ఆమె తన ధైర్యసాహసాలను ప్రదర్శించింది. వారిని నిలదీసింది. తన పట్ల ఎస్పీ నేత అనుచరుడు ఒకరు అసభ్యంగా ప్రవర్తించడంతో, ఆమె వారి కారు బానెట్ పైకి ఎక్కి నిలదీసింది.

ఆగ్రాలో సమాజ్ వాది పార్టీకి చెందిన నాయకుడి అనుచరుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతని మెర్సిడెజ్ కారు పైకి ఎక్కి హంగామా సృష్టించింది. పార్టీ జెండాను చించేసింది. ఆమె ధైర్య సాహసాల వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చాలామంది షేర్ చేస్తున్నారు.

ఇది రెండు నిమిషాల నిడివి గల వీడియో. ఆమె తన స్కూటీని అక్కడే వదిలేసి, ఎమ్మెల్యే అనుచరుడి కారును ఎక్కింది. కారు పైన ఉన్న ఎస్పీ జెండాను లాగే పారేసింది. అంతేకాదు, తన ఎదుటకు వచ్చి తనను ఎదుర్కోవాలని, అతనికి అతని బాడీ గార్డ్‌కు సవాల్ చేసింది.

ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగిందని తెలుస్తోంది. ఆమె తన సోదరితో కలిసి ఓ డాక్టర్ వద్దకు వెళ్తోంది. ఆమె పేరు జ్యోతిపాండే అని తెలుస్తోంది. ఆమె నిలదీయడంతో సదరు నేత కూడా తగ్గక తప్పలేదు. దీంతో, మిగతా వారు అతనిని పోలీసులకు అప్పగించారు.

Winked at by gunner, woman breaks SP leader’s car as video goes viral

కర్నాటకలో పరువు హత్య

కర్నాటకలోని రాయచూర్‌‍కు సమీపాన యరమరాస్‌లో బసవ రాజేశ్వరి అనే యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఆనందసాగర్ (30)ను ఆమె కుటుంబ సభ్యులు చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యరమరాస్‌లోని రెండు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన రాజేశ్వరి, ఆనంద సాగర్ 13 నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

అప్పటి నుండి వారి కుటుంబాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఉంది. ఆనంద్ సాగర్ తన భార్యతో కలిసి వేరే ఊళ్లో ఉంటున్నారు. తమ ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులను వదిలి పెట్టేందుకు ఆయన ఆదివారం రాత్రి యరమరాస్ వచ్చి మెయిన్ రోడ్డులో నిలబడి ఉండగా, యువతి తండ్రి సహా ఎనిమిది మంది అతని పైన రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం పారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+