లవ్ బ్రేకప్: చేతులు ఎత్తేసిన ప్రియుడు, యాసిడ్ పోసిన యువతి, చివరికి అతని పరిస్థితి !

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యి వేరే యువతితో తిరుగుతున్నాడని సహించలేని యువతి మాజీ ప్రియుడి ముఖం మీద యాసిడ్ పోసి కక్ష తీర్చుకుంది. ముంబైలోని గూర్ గాంవ్ పశ్చిమ ప్రాంతంలో ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన మీరా శర్మా (25) అనే యువతిని అరెస్టు చేశారు.

మాజీ ప్రియురాలు మీరా శర్మా యాసిడ్ దాడి చెయ్యడంతో ముఖం, చేతులు కాలిపోవడంతో ఓం సింగ్ సోలంకి (26) అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు. మీరాను 14 రోజులు రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కొన్ని ఏళ్లు లవర్స్

కొన్ని ఏళ్లు లవర్స్

సోలంకి, మీరా గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏడు నెలల క్రితం ఇద్దరి మద్య ఓ విషయంలో గొడవ మొదలైయ్యింది. అప్పటి నుంచి వీరి మద్య గొడవలు ఎక్కువ అయ్యాయని సమాచారం.

లవ్ బ్రేకప్, మొత్తం కట్ !

లవ్ బ్రేకప్, మొత్తం కట్ !

సోలంకి, మీరా గతంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణించుకున్న తరువాత శారీరకంగా కలిశారని సమాచారం. అయితే నిత్యం గొడవలు జరగడంతో వారి ప్రేమకు సోలంకి బ్రేకప్ చెప్పేశాడు. తరువాత మీరాకు చిక్కకుండా జాగ్రత్తగా తప్పించుకుని తిరుగుతున్నాడు.

సహనం కొల్పోయిన మీరా !

సహనం కొల్పోయిన మీరా !

తనకు కనపడకుండా, మొబైల్ నెంబర్ మార్చి తప్పించుకుతిరుగుతున్న సోలంకి కోసం మీరా గాలించింది. గత నాలుగు నెలల నుంచి సోలంకి కోసం గాలించిన మీరా చివరికి సహనం కొల్పోయింది. సోలంకి స్నేహితుల దగ్గర ఆరా తీసినా ఫలితం లేకపోయింది.

చివరికి చిక్కాడు !

చివరికి చిక్కాడు !

లవ్ బ్రేకప్ చెప్పేసిన సోలంకి తరువాత ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. సోలంకి మరో యువతితో తిరుగుతున్నాడని సమాచారం. ఈ విషయం ఎలాగో మీరాకు తెలిసింది. ప్రియుడితో మాట్లాడటానికి అతను పని చేస్తున్న కంపెనీ దగ్గరకు వెళ్లింది. మళ్లీ సోలంకి, మీరాల మద్య గొడవ మొదలైయ్యింది.

పక్కా ప్లాన్ తో యాసిడ్ !

పక్కా ప్లాన్ తో యాసిడ్ !

మాజీ ప్రియుడితో మాట్లాడటానికి బయలుదేరిన మీరా ముందుగానే సిద్దం చేసుకున్న యాసిడ్ వెంట తీసుకెళ్లింది. గొడవ జరగడంతో సహనం కొల్పోయి మాజీ ప్రియుడు సోలంకి మీద యాసిడ్ పోసిందని పోలీసులు చెప్పారు. సోలంకి ఏ అమ్మాయితో తిరగకుండా చెయ్యడానికే తాను యాసిడ్ పోశానని మీరా అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Omsingh Solanki (26), and Meera Sharma (25) were in a relationship around five years ago. But Solanki broke up with Sharma recently. The police said that the break-up did not go down well with Sharma.
Please Wait while comments are loading...