ఎయిర్ పోర్టులో 33 బుల్లెట్స్ సీజ్: మహిళ అరెస్టు
న్యూఢిల్లీ: సజీవంగా ఉన్న బుల్లెట్లు అక్రమంగా తరలిస్తున్న మహిళను న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి సజీవంగా ఉన్న 33 బుల్లెట్లు (.22 క్యాలిబర్) స్వాధీనం చేసుకున్నామని అధికారులు అన్నారు.
సోమవారం రాత్రి ఆమె అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విషయం అధికారులు గుర్తించారు. అధికారులకు అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వ్యానిటీ బ్యాగ్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ బ్యాగ్ లోనే బుల్లెట్లు బుల్లెట్లు బయటపడ్డాయి.

వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ బుల్లెట్లు ఎక్కడి నుంచి తీసుకువచ్చింది అనే విషయం ఆమె కచ్చితంగా చెప్పడం లేదని, పదే పదే మాటలు మార్చుతున్నదని అధికారులు అన్నారు. ఆమె భర్తతో కలిసి దీనాపూర్ ప్రయాణించడానికి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిందని అధికారులు చెప్పారు.
ఉగ్రవాదులు దేశంలో చోరబడ్డారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 10 నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు, ప్రముఖ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ ల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications