ఎనిమిదేళ్లుగా నర్సుపై ఆస్పత్రి యజమాని రేప్: కేసు

మిడ్నాపూర్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్‌లో దారుణం జరిగింది. ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సుపై ఆ ఆస్పత్రి యజమాని గత ఎనిమిదేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధిత మహిళను మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఆస్పత్రిలో ఉన్న సిసిటివి ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. యజమానికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు. అతని చాంబర్‌లో అతడు మహిళతో కలిసివున్నట్లు వీడియోలో ఎక్కడా కనబడలేదని పోలీసులు తెలిపారు.

Woman complains of rape in West Bengal

ఇటీవల ఓ ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన పొరుగింటి వ్యక్తి ఆమెను ఓ చెట్టుకు ఉరివేసి దారుణంగా హత్య చేశాడు. తూర్పు మిడ్నాపూర్‌లోని రాజ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

కాగా, ఘటన కారణమైన నిందితుల గురించి తీవ్రంగా గాలించిన కుటుంబసభ్యులు, స్థానికులు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు మృతి చెందాడు. తాంత్రికుడిగా పేర్కొంటున్న ఆ వ్యక్తికి సంబంధించిన ఇద్దరు సహాయకులను కూడా చితకబాదారు. తీవ్రగాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భూములకు సంబంధించిన వివాదమే ఈ ఘటనకు కారణమని పోలీసులు నిర్ధారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+