టీవీ షోలో ఒప్పుకోలు: ప్రియుడితో కలిసి భర్త హత్య

ఆమెకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆమె లొంగిపోయిన రెండు రోజులకు ఆమె ప్రియుడు టి రాజన్ (49) కూడా పోలీసులకు లొంగిపోయాడు. అతనికి కూడా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
తిరువూరు జిల్లాకు చెందిన సుమతి భర్త ఎస్ ధనశేఖర్ (46) ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆమె కూడా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. రాజన్‌తో కలిసి సుమతి ధనశేఖర్‌కు మే 14వ తేదీన తమ ఇంట్లో విషమిచ్చి చంపారు.
సుమతి తమ కుటుంబ సభ్యుల ముందు నేరాన్ని అంగీకరించిందని మృతుడి సోదరుడు ఎస్ కన్నదాసన్ చెప్పారు. కొన్ని వారాల క్రితం టీవీ రియాల్టీ షోలో సుమతి స్వయంగా నేరాన్ని అంగీకరించింది. సుమతి, రాజన్‌లపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications