మహిళా కానిస్టేబుల్ పై యాసిడ్ దాడి, భర్తతో గొడవలే కారణమా ,ఇతర కారణాలున్నాయా?

మహిళ కానిస్టేబుల్ పై గుర్తు తెలియని దుండగులు వెల్లూరు జిల్లా తిరుప్పత్తూరులో యాసిడ్ పోసి దాడికి దిగారు.

తమిళనాడు : ఆమె ప్రజలను రక్షించే పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. అయితే ఆమెకే రక్షణ లేకుండా పోయింది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమెపై యాసిడ్ తో దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లా తిరుప్పతూరులో ఓ మహిళ కానిస్టేబుల్ పై గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి యాసిడ్ పోశారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్ పోశారు.

woman constable injured in acid attack at tirppattur

భర్తతో గొడవల కారణంగా పిల్లలతో కలిసి ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ గొడవలతోనే ఆమె పై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడ ఉన్నాయి.అయితే ఈ దాడికి ఎవరూ పాల్పడ్డారనే విషయాన్ని ఇంకా నిర్థారించలేదు.

తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ లావణ్యను వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. లావణ్య ముఖం, చేతులు తీవ్రంగా కాలిపోయాయని వైద్యులు చెప్పారు. ఈ ఘటనకు భాద్యులైన నిందితులను పట్టుకొనేందుకు గాలింపును చేపట్టామని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+