దారుణం: భార్య చదివిస్తున్న అమ్మాయిపై భర్త రేప్
థానే: పని మనిషిగా చేస్తున్న ఓ మైనర్ బాలికపై ఇంటి యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ కానిస్టేబుల్ భర్త అయిన నిందితుడిపై బాధితురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థానేకు చెందిన జైపాల్ గోవింద్ పర్‌దేశీ అనే వ్యక్తి స్థానిక సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. జైపాల్ భార్య మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది.

గత కొంతకాలంగా జైపాల్ భార్య స్థానికంగా ఉండే ఓ బాలికను తన ఇంట్లో పనికి కుదుర్చుకుంది. అంతేగాక, తీరిక వేళల్లో బాలికకు చదువు చెబుతూ.. ఆమె విద్యాభ్యాసానికి కావాల్సిన ఆర్థికసాయం చేసింది.
కాగా, గత అక్టోబర్ 24 నుంచి జైపాల్ తన భార్య ఇంట్లో లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు.
అయితే ఆ బాలిక ఈ విషయాన్ని తన తోటి స్నేహితులకు చెప్పగా.. వారు బాలిక తల్లిదండ్రులకు సమాచారమందించారు. దీంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని జైపాల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications