ఐటీ హబ్‌లో వర్ష బీభత్సం: స్కూటీపై వెళుతోన్న మహిళపై విరిగిపడ్డ చెట్టు, అక్కడికక్కడే మృతి..
బెంగళూరులో వర్ష బీభత్సం సృష్టించింది. వర్షానికి తోడు ఈదురుగాలులు వీచాయి. దీంతో భారీ వృక్షాలు నెలకొరిగాయి. ఓ వివాహితపై చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు.

బెంగళూరులోని బెగార్ వద్ద నుంచి హేమ (45) అనే వివాహిత మంగళవారం వెళ్తున్నారు. అయితే అప్పటికే ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటాలే అని ఆమె అనుకొంది. కానీ అంతలోనే మృత్యువు ఎదురొచ్చింది. అలా ఆమె వెళుతున్న సమయంలో చెట్టు కొమ్మ స్కూటర్‌పై పడింది.
ఒక్కసారిగా పడటంతో ఆమె వాహనంతోపాటు పడిపోయారు. ఆమె కు తీవ్రగాయాలు కావడంతో.. అక్కడికక్కడే చనిపోయారు. గత కొన్నిరోజుల నుంచి బెంగళూరులో వర్షం కురుస్తోండగా.. మంగళవారం కూడా పడింది. బెంగళూరులో వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. వచ్చేనెల 5వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications