Marriage: భర్త టార్చర్ భరించలేక.. పారిపోయి లోన్ రికవరీ ఏజెంట్‍ను పెళ్లాడిన భార్య
Marriage: భర్త తాగుబోతు అయితే ఆ ఇల్లాలు పడే నరకం మామూలుగా ఉండదు. కొందరు తాగి వచ్చి భార్యలను తిట్టేవారు, కొట్టేవారు కూడా చాలా మంది ఉంటారు. కొన్ని కొన్ని సార్లు తాగుబోతు భర్తలు పెట్టే నరకాన్ని భరించలేక మహిళలు ఆత్మహత్యలు చేసుకోవడమో.. లేదా తమ భర్తలను హత్య చేయడమో చేస్తూ ఉంటారు. చాలా వరకు కేసుల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొందరు మాత్రం తమ తాగుబోతు భర్తలను మార్చుకుని తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. మరికొందరు ఆ భర్త నాకొద్దు అంటూ వదిలేస్తూ ఉంటారు. తాజాగా ఓ భార్య కూడా అలాంటి పనే చేసింది. తాగుబోతు భర్త వేధింపులు భరించలేక లోన్ రికవరీ ఏజెంట్ తో వెళ్లిపోయి పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
తాగుబోతు భర్త పెట్టే బాధలతో విసిగిపోయి తమ ఇంటికి లోన్ రికవరీ ఏజెంట్ ను ఇంద్రకుమారి వివాహం చేసుకుంది. లోన్ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్ తో పరిచయం పెంచుకుని చివరికి అతడితో కలిసి పారిపోయి పెళ్లిచేసుకుంది. ఇంద్రకుమారి 2022లో బిహార్ లోని జముయ్ జిల్లాలోని కర్మటాండ్ గ్రామానికి చెందిన నకుల్ శర్మను వివాహం చేసుకుంది. మద్యానికి బానిసైన నకుల్ ఇంద్రకుమారిని విపరీతంగా టార్చర్ పెట్టినట్లు తెలిసింది. శారీరక, మానసిక వేధింపులను భరించలేక ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించింది.

ఈ సమయంలోనే జాజల్ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి పవన్ కుమార్ యాదవ్ తో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తి బ్యాంకు ఇచ్చిన లోన్లను రికవరీ చేసే ఏజెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కర్మటాండ్ గ్రామానికి కూడా వెళ్లి అక్కడున్న వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే ఇంద్రకుమారి, పవన్ కుమార్ యాదవ్ కు పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకుని మాట్లాడుకునేవారు. తన భర్త పెట్టే వేధింపులు భరించలేక పవన్ కుమార్ యాదవ్ కు దగ్గరైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే పవన్ తో కలిసి పారిపోయింది. ఫిబ్రవరి 4న వారు విమానంలో పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ కు చేరుకున్నారు. అక్కడే కొన్ని రోజుల పాటు ఉన్నారు. అనంతరం ఫిబ్రవరి 11న ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. సాంప్రదాయ హిందూ ఆచారాలతో జరిగిన వారి వివాహానికి చాలా మంది హాజరయ్యారు. వారి పెళ్లి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పవన్ కుమార్ కుటుంబం వివాహాన్ని అంగీకరించినప్పటికీ.. ఇంద్ర కుమారి కుటుంబం ఆ పెళ్లిని వ్యతిరేకిస్తోంది. ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పవన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇంద్రకుమారి తన ఇష్టానుసారం పవన్ ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. పవన్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఇంద్ర కుమారి కుటుంబం నుంచి బెదిరింపులు రావడంతో నూతన వధూవరులు అధికారుల నుంచి రక్షణ కోరుతున్నారు. బంధువులు తమపై దాడి చేస్తారని.. సామాజికంగా వ్యతిరేకత వస్తోందని వారు భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications