ఆ మాజీ మంత్రి నన్ను రేప్ చేశాడు: మహిళ కేసు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్‌పై ఢిల్లీ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. హరక్ సింగ్ తనను లైంగికంగా వేధించి, తనపై అత్యాచారం చేశాడని 32 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సఫ్దర్‌జంగ్ పోలీసులు శుక్రవారంనాడు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఉద్యోగం కోసమని హరక్ సింగ్ తనను ఢిల్లీ గ్రీన్ పార్కులోని తన ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె 15 ఏళ్ల కిందట కూడా హరక్ సింగ్‌పై ఇదే తరహాలో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

 Woman files rape case against Uttarakhand leader Harak Singh Rawat

అస్సాంకు చెందిన మహిళ ఆమెపై ఫిర్యాదు చేశారు. ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీలో తిరుగుబాటు లేవదీయడంలో హరక్ సింగ్ కీలక పాత్ర పోషించారు. రావత్‌పై తిరుగుబాటు చేసిన శాసనసభ్యులకు ఆయన నాయకత్వం వహించారు.

ఆయన తిరుగుబాటు కారణంగా ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో రావత్ ప్రభుత్వ పునరుద్ధరణ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి పదవికి రాజీనా చేసి బిజెపి గూటికి చేరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An FIR was registered against Bharatiya Janata Party leader and former Uttarakhand minister Harak Singh Rawat on Saturday for allegedly raping a 32-year-old woman in the national capital on the pretext of getting her a job.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి