షాక్: భర్తను కట్టేసి భార్యపై గ్యాంగ్‌రేప్, 3 రోజులపాటు నలుగురిలా..
బెంగుళూరు: మహిళలపై అత్యాచారాలు , దాడులు, దౌర్జన్యాలు ప్రతి రోజు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే భర్త ముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు అరికట్టేందుకు పాలకులు ఎన్ని రకాల చర్యలు తీసుకొన్నా ఫలితం లేకుండా పోయింది.అయితే నిందితులను కఠినంగా శిక్షిస్తే ఈ తరహ ఘటనలు చోటుకొనే అవకాశాలు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిపై వెంటనే శిక్షలు పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

గృహిణిపై గ్యాంగ్ రేప్
బెంగుళూరులో ఓ వివాహితపై ఆమె భర్త ముందే గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు దుండగులు.ఆమె భర్త ఆటో డ్రైవర్. బాధితురాలు ఓ దుస్తుల పరిశ్రమలో పనిచేస్తోంది.అయితే బాధితురాలి పట్ల రాఘవేంద్ర అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.దీంతో ఆమె అతడిని మందలించింది. ఇది తట్టుకోలేక నిందితుడు తన స్నేహితులతో కలిసి ఆమె ఇంటికి వెళ్ళి భర్తను కొట్టి అతడి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితుల అరెస్ట్
గృహిణిపై ఆమె ఇంట్లోనే గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులను పోలీసులు గుర్తించారు. స్థానికంగా రౌడీగా పోలీసుల రికార్డుల్లో నమోదైన రాఘవేంద్ర అలియాస్ కుమార్, పునీత్, వెంకటేశ్‌గా గుర్తించారు. విజయ్ అలియాస్ విజి అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. బాధిత మహిళ తొలుత ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు.

నేపాల్ మహిళపై గ్యాంగ్ రేప్
బెంగళూరు మెజెస్టిక్ బస్టాండులో కూలీ పని కోసం నిలుచున్న నేపాలీ యువతికి (20) మాయమాటలు చెప్పిన నలుగురు దుండగులు ఆమెను ఆనేకల్ సమీపంలోని అవడదనెహళ్లికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకూ ఆమెపై వరుసగా దాడికి దిగారు.

పాడిబడిన ఇంట్లో శబ్దాలతో
అవడదనెహళ్లి గ్రామ శివార్లలో ఉన్న పాడుబడిన ఇంటి నుంచి శబ్దాలు వినిపిస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు అక్కడకు వెళ్లేసరికి దుండగులు పరారయ్యారు. అచేతనావస్థలో పడున్న బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె అందించిన సమాచారం ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అత్యాచారం తరువాత ఆమెను హత్య చేసేందుకు విఫలయత్నం చేశారు












Click it and Unblock the Notifications