షాక్: మహిళపై ఆరుగురు గ్యాంగ్ రేప్ చేసి వీడియో పోస్ట్ చేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

కోట: రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆరుగురు వ్యక్తులు 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార సంఘటనను నిందితులు చిత్రీకరించి, వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.

నేరం గత నెలలో జరగగా, బాధితురాలు ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారనే విషయం తెలియడంతో బాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆరుగురిపై కేసు నమోదు

ఆరుగురిపై కేసు నమోదు

ఆరుగురు యువకులపై బాధితురాలు మార్చి 5వ తేదీన ఫిర్యాదు చేసింది. ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎవరినీ అరెస్టు చేయలేదు. బాధితురాలు రోడ్డు పక్కన ఉండే దాబాలో పనిచేస్తుంది.

బైక్‌పై తీసుకుని వెళ్లి..

బైక్‌పై తీసుకుని వెళ్లి..

నెల రోజుల క్రితం తన బరాన్‌లోని తన అత్తగారింటికి వచ్చానని, నిందితుల్లో ఒకతను చేతన్ మీనా (21) మోటార్ బైక్‌‌పై తీసుకుని వెళ్తానని నమ్మించాడని, అతను తనకు బాగా తెలిసి ఉండడంతో బైక్ ఎక్కానని, అయితే తను సమాస్పూరా గ్రామ సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో చెప్పింది.

రేప్ చేసి వీడియో తీశారు

రేప్ చేసి వీడియో తీశారు

మరో ఐదుగురు కూడా అక్కడికి వచ్చారని, ఆరుగురు తనపై అత్యాచారం చేశారని, దాన్నంతా మొబైల్‌లో చిత్రీకరించారని బాదితురాలు చెప్పిది. మర్నాడు తనను తన అత్తగారింటి వద్ద దించారని, విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారని ఆమె వివరించింది.

సోషల్ మీడియాలో వీడియో పోస్టు

సోషల్ మీడియాలో వీడియో పోస్టు

అత్యాచార ఘటనకు సంబంధించి వీడియో ఇంటర్నెట్‌లో పెట్టారని తెలిసి ధైర్యం కూడదీసుకుని తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పింది. అది ఆ ప్రాంతమంతా పంపిణీ అయింది. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు సోమవారంనాడు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, a 40-year-old woman was gang-raped raped by six men in Rajasthan's Baran district. The accused also made a video of the crime and shared it on the social media.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి