భర్తపై దాడి చేసి భార్యపై గ్యాంగ్‌రేప్: నలుగురి అరెస్ట్

ఖమ్మం: ఓ వ్యక్తిపై దాడి చేసి అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు దుండుగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులలో ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 12న రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాధిత దంపతులు తెలంగాణలోని వరంగల్ జిల్లాకు వలస వచ్చారు. భద్రాచలం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆ దంపతులపై దుండగులు దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Woman gangraped in Telangana, 4 held

‘నలుగురు ప్రయాణిస్తున్న ఆటోలో ఆ దంపతులు ఎక్కారు. వారిని మునుగురు క్రాస్ రోడ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మహిళ భర్తపై దాడి చేసిన దుండగులు, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు' అని బూర్గంపాడు పోలీసులు తెలిపారు.

పారిపోయే ముందు దంపతుల వద్ద ఉన్న రూ. 3,500లను, నగలను, సెల్‌ఫోన్‌ను కూడా దుండగులు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. నిందితులైన ఆటో డ్రైవర్ నర్సింహ, రామకృష్ణ, సతీష్, బాలులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+