అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి కొడుకు హత్య
మథుర: తన వివాహేతర సంబంధానికి అడ్డుస్తున్నాడని కన్న కొడుకును తన ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మానత్వంలేని తల్లి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితులు జ్యోతి శర్మ, ఆమె ప్రియుడు షేర్ సింగ్, అతని సహచరుడు శైలులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు నగర ఎస్పీ షలేష్ పాండే తెలిపారు. జ్యోతీ కొడుకు భూపేంద్ర జూన్ 1, 2014 నుంచి కనిపించడం లేదని ఆయన తెలిపారు.
జ్యోతి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న షేర్ సింగ్‌తో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకుంది. అయితే తన అక్రమ సంబంధానికి కొడుకు భూపేంద్ర అడ్డుగా ఉన్నాడని భావించి, అతడ్ని హత్య చేయాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో భూపేంద్రను హత్య చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లర్‌ను సంప్రదించాలని, అతనికి రూ. 10లక్షలు చెల్లించేందుకు తాను సిద్ధమని జ్యోతి తన ప్రియుడు షేర్ సింగ్‌కు తెలిపింది. దీంతో షేర్ సింగ్, తన సహచరుడు శైలుతో కలిసి భూపేంద్రను తమ బైక్‌పై సదాబాద్ ప్రాంతానికి తీసుకెళ్లారు.
అక్కడే భూపేంద్రను కాల్చి చంపారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని, తుపాకీని సమీపంలోని బావిలో పడేశారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని వెలికితీసి, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పాండే తెలిపారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications