తొలిసారి: ‘శని’ ఆలయ అధ్యక్షురాలిగా మహిళ

ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఉన్న శని శింగనాపూర్ ఆలయం 5 శతాబ్దాల చరిత్రలో తొలిసారి ఓ మహిళ చైర్‌పర్సన్‌గా సోమవారం నియమితులయ్యారు. గృహిణి అనితా షీతే(40)కు శని శింగనాపూర్‌ ఆలయ ట్రస్టు బాధ్యతలు అప్పగించారు.

ఐదేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, ఈ కమిటీలో 11 మంది ధర్మకర్తల్లో మరో మహిళ కూడా ఉన్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలోపలకు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించడానికి ఇటీవల ప్రయత్నం జరిగినప్పుడు ఘర్షణ చోటుచేసుకొంది.

Woman to head Shani Shingnapur temple trust

ఆలయంలో ఓ మహిళ ప్రవేశించినందుకు ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదమయింది. అయిదు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో మహిళలపై ఉన్న నిషేధం కొనసాగేలా చూస్తాననీ, గర్భాలయంలోకి మహిళల్ని అనుమతించే ఆలోచనే లేదని అనితా షీతే మీడియాకు స్పష్టం చేశారు.

సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు ఆలయ వేదిక మీదికి వచ్చి పూజలు చేయడంతో ఈ ఆలయం ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. శని ఆలయంలో ‘చౌతారా'(శని విగ్రహం) వద్ద పూజలు చేసేందుకు పురుషులనే అనుమతిస్తారు. మహిళలు శని విగ్రహానికి తైలపూజ చేసే సంప్రదాయం ఇప్పటివరకు లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+