మీరట్లో బంధించి పది రోజులు రేప్, 2 నెలలుగా బాలికపై సోదరులు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. 22 ఏళ్ల యువతిని బందించి, పది రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బేగంపూర్ ప్రాంతానికి చెందిన యువతిని దండగులు అపహరించుకుపోయారు.

ఆమెను జనవరి 4వ తేదీన కారులో ఎత్తుకు పోయారు. తన భర్తతో గొడవ విషయమై ఆమె మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్తుండగా వారు ఎత్తుకెళ్లారు. అనంతరం గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకు వెళ్లి బందించి, పదిరోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
తమిళనాడులో మరో ఘోరం వెలుగు చూసింది. ఇద్దరు సోదరులు ఓ బాలిక పైన అత్యాచారానికి ఒడిగట్టారు. దాదాపు రెండు నెలల పాటు ఆమె పైన వారు అఘాయిత్యం చేశారు. ఈ విషయమై బాలిక, కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులకు తెలిసింది. వారి నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications