5.1కేజీల బరువుతో ఆడ శిశువు జననం -ఇలా జరగడం అరుదంటోన్న డాక్టర్లు
సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల బరువు 2.5 కేజీల నుంచి 3.7 కేజీల మధ్యలో ఉంటే వారిని ఆరోగ్యవంతులైన నవజాత శిశువుగా భావిస్తారు. అంతకుమించిన బరువుతో శిశువులు జన్మించడం అత్యంత అరుదని, ఏకంగా 5 కేజీలకు మించిన బరువుతో శిశువులు జన్మించడం మాత్రం అసాధారణమని డాకర్లు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని మాల్దా జిల్లాలో ఆ అరుదైన ఘటన చోటుచేసుకుంది..
మాల్దాకు చెందిన రక్షా కుశ్వాహ (29) అనే శనివారం మహిళ నొప్పులతో స్థానిక అంజినీయ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు ప్రసవం చేయగా 5.1 కిలోల ఆడ శిశువు జన్మించింది. సాధారణం కంటే ఎక్కువ బరువుతో పుట్టిన పాపను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

రక్షా కుశ్వాహ జన్మనిచ్చిన పాప 5.1 కేజీల బరువు, 54 సెంటీమీటర్ల పొడవు ఉన్నదని ఆమెకు ప్రసవం చేసిన వైద్యుడు అజయ్ తోష్ వెల్లడించారు. పాప ఆరోగ్యంగానే జన్మించినప్పటికీ.. ఆదివారం మధ్యాహ్నానికి మూత్ర విసర్జనలో సమస్య ఉన్నట్లు తేలిందని డాక్టర్ చెప్పారు. అయితే సమస్య చిన్నదే అని, కొన్ని పరీక్షలు చేసి చికిత్స అందిస్తే సరిపోతుందని తెలిపారు.
Recommended Video
సాధారణంగా మధుమేహం, ఊబకాయం, హార్మోనల్ సమస్యలు ఉన్నవారికి శిశువులు అధిక బరువుతో జన్మించే అవకాశం ఉంటుందని, కానీ రక్షా కుశ్వాహకు ఆ సమస్యలు ఏవీ లేవని చెప్పారు. ఆమెకు ఇప్పటికే మూడేళ్ల కూతురు ఉండగా, ఇప్పుడు రెండో సంతానంగా ఐదు కేజీల బుజ్జాయి జన్మించింది.












Click it and Unblock the Notifications