వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: బైక్ డిమాండ్ చేసిన వరుడికి విడాకులు, 3 గంటల్లోనే మరో వ్యక్తితో వివాహం

మోటార్ సైకిల్ ను డిమాండ్ చేసిన పెళ్ళికొడుకుకు విడాకులిచ్చేసింది భార్య. భర్తకు విడాకులిచ్చిన మూడు గంటల్లోనే మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాంచీ: మోటార్ సైకిల్ ను డిమాండ్ చేసిన పెళ్ళికొడుకుకు విడాకులిచ్చేసింది భార్య. భర్తకు విడాకులిచ్చిన మూడు గంటల్లోనే మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

జార్ఖండ్ లోని చాంద్వా గ్రామంలో రుబీనా పర్వీన్ అనే 18 ఏళ్ళ యువతి బుధవారం నాడు తాను పెళ్ళిచేసుకొన్న భర్త ముంతాజ్ అన్సారీ అనే యువకుడికి విడాకులిచ్చేసింది. విడాకులు తీసుకొన్న మూడు గంటల్లోనే ఆమెకు అదే గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది.

పెళ్ళైన వెంటనే ముంతాజ్ అన్సారీ తనకు మోటార్ సైకిల్ కావాలంటూ అత్తింటివారిని డిమాండ్ చేశాడు. మోటార్ బైక్ తెస్తేనే తాను అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్తానని డిమాండ్ చేశాడు. దీంతో పెళ్ళికూతురు తండ్రి బషీరోద్దిన్ హీరో హోండా ఫ్యాషన్ బైక్ ను కొనుగోలు చేసి తెచ్చాడు.

Woman In Jharkhand Dumps Groom Who Demanded Bike In Dowry

అయితే ఈ బైక్ తనకు వద్దని అంతకంటే ఖరీదైన బైక్ కావాలని అన్సారీ మళ్ళీ గొడవ చేశఆడు. పెళ్ళి కూతురు కుటుంబసభ్యులు, పెళ్ళి పెద్దలు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతను వినిపించుకోలేదు.

దీంతో తనకు ఈ భర్త వద్దని పెళ్ళికూతురు రుబానా ఫర్వీన్ తేల్చి చెప్పింది. పెళ్ళిరోజే ఇంత గొడవ పెడుతున్నాడు. జీవితాంతం అతడితో వేగడం కష్టమని ఆమె కుటుంబసభ్యులకు చెప్పింది.దీంతో అన్సారీతో పెళ్ళిని తెగతెంపులు చేసుకొనేందుకు సిద్దపడ్డారు కుటుంబసభ్యులు.వెంటనే మత పెద్ద ఖాజాకు కబురు పంపారు.

పెళ్ళికొడుకు ముంతాజ్ మెడలో చెప్పుల దండ, కట్నం కోసం కక్కుర్తిపడ్డాను అనే బోర్డును తగిలించారు. పెళ్ళి పందిట్లోనే తిప్పి గుండు గీయించి ఇంటికి పంపారు. పెళ్ళి కొడుకును సమర్థించిన సోదరుడికి కూడ సగం గుండు గీయించారు.

అదే సమయంలో వచ్చిన ఖాజా మొదటి పెళ్ళిని రద్దు చేశారు. ఆమె తండ్రి బషీరుద్దీన్ అదే ఊరికి చెందిన మహమ్మద్ ఇలియాస్ అనే యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడి అదే పందింట్లో వివాహం జరిపించారు. అయితే జీవితాంతం ఎరురయ్యే వేధింపుల నుండి తన కూతురిని రక్షించాననే ఆనందం తనకు ఉందని బషీరుద్దీన్ చెప్పారు.

English summary
Avarice is bad, is the lesson a groom in a Jharkhand town learnt when he not only sought the hand of a young woman but also a brand new motorcycle from her family. In the bargain, he lost both.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X