భర్త గొంతును కత్తిపీటతో కోసి చంపేసిన భార్య, శవాన్ని బాత్ రూంలో పూడ్చింది, నిద్రలో !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: పీకలదాక మద్యం సేవించి ప్రతిరోజు వేధింపులకు గురి చేస్తున్నాడని భర్తను భార్య అతి దారుణంగా హత్య చేసింది. విషయం బయటకు తెలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తోందని భయంతో భర్త శవాన్ని ఇంటి ఆవరణంలోని బాత్ రూంలో పూడ్చిపెట్టింది.

పీకలదాకా తాగేసి

పీకలదాకా తాగేసి

కర్ణాటకలోని దావణగెరె జిల్లా న్యామతి తాలుకా అరుండి గ్రామంలో నరసింహప్ప (45), రేణుకా దంపతులు నివాసం ఉంటున్నారు. నరసింహప్ప నిత్యం పీకలదాక మద్యం సేవించి డబ్బులు ఇవ్వాలని భార్య రేణుకాను పీడించేవాడు.

రాత్రి సీన్ రిపీట్

రాత్రి సీన్ రిపీట్

ఎప్పటిలాగే సోమవారం రాత్రి పీకలదాక మద్యం సేవించిన నరసింహప్ప ఇంటికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని భార్య రేణుకాను వేధించాడు. డబ్బులేదని ఎంత చెప్పినా నరసింహప్ప మాట వినలేదు. ఆ సమయంలో సహనం కొల్పోయిన రేణుకా భర్తను చంపేయాలని నిర్ణయించింది.

మద్యం మత్తులో నిద్ర

మద్యం మత్తులో నిద్ర

మద్యం మత్తులో నిద్రపోయిన నరసింహప్పను రేణుకా గుర్తించింది. వంట గదిలోకి వెళ్లి కత్తిపీట తీసుకు వచ్చి భర్త నరసింహప్ప గొంతుకోసి హత్య చేసింది. విషయం పోలీసులకు తెలిస్తే జైలుకు పంపిస్తారని రేణుకా భయపడిపోయింది.

బంధువు వెళ్లాడు

బంధువు వెళ్లాడు

ఇంటి ఆవరణంలోని బాత్ రూంలోకి భర్త నరసింహప్ప శవాన్ని తీసుకెళ్లి పూడ్చి పెట్టింది. ఇంటి ఆవరణంలో రక్తపు మరకలు శుభ్రం చేస్తున్న సమయంలో రేణుకా బంధువు ఒక్కరు అక్కడికి వెళ్లారు. అనుమానం వచ్చి బాత్ రూంలో చూడగా నరసింహప్ప చెయ్యి మాత్రం కనపడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఓపికలేక చంపేశాను

ఓపికలేక చంపేశాను

తన భర్త నరసింహప్ప నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని, ఓపికలేక చివరికి తాను హత్య చేశానని రేణుకా అంగీకరించిందని న్యామతి పోలీసులు తెలిపారు. రేణుకాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Woman Killed her husband buried dead body in toilet in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X