తాగిన మత్తులో వ్యక్తిని చంపిన మహిళ: బాలుడి హత్య

లక్ష్మిని వెంటబెట్టుకుని తిరుమలగిరి వచ్చిన అంజమ్మ కుమారుడు లక్ష్మణ్‌కు ఆమెను పరిచయం చేసింది. సోమవారం సాయంత్రం ముగ్గురూ కలిసి కల్లు తాగారు. అంజమ్మ గుడిసెలోని ఓ గదిలో నిద్రిస్తుండగా, మరో గదిలో లక్ష్మణ్, లక్ష్మి నిద్రపోయారు. అర్థరాత్రి సమయంలో లక్ష్మణ్ కోరిక తీర్చమని లక్ష్మిని కోరాడు. ఆగ్రహం చెందిన ఆమె పక్కనే ఉన్న గొడ్డలి తీసుకొని లక్ష్మణ్ ముఖంపై కొట్టి చంపించింది.
అలికిడికి అంజమ్మ నిద్రలేవడంతో లక్ష్మి గొడ్డలితో ఆమెపై దాడి చేసింది. స్వల్పగాయాలైన అంజమ్మ కేకలు వేసింది. పక్క గుడిసెల్లో ఉంటున్న వారు వచ్చే లోగా లక్ష్మి పరారైంది. స్థానికుల సమాచారంతో తిరుమలగిరి పోలీసులు సంఘటన స్థ్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విశ్వనీయ సమాచారంతో మంగళవారం మధ్యాహ్నం కాచిగూడ రైల్వేస్టేషన్‌లో లక్ష్మిని పట్టుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం నిందితురాలి స్వగ్రామమని పోలీసులు చెప్పారు. గతంలో హిందువును పెళ్లి చేసుకుని లక్షిగా పేరు మార్చుకుందని తిరుమలగిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికిరణ్ తెలిపారు.
బాలుడిని హత్య చేసిన స్నేహితులు
హైదరాబాద్ పాతబస్తీలో 16 సంవత్సరాల బాలుడిపై స్నేహితులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడేశారు. చావుని నాదల్లి బేగ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ నవాజ్ (16) ఛత్తాబజార్‌లోని నాన్‌కీ రోటీ షాపులో పనిచేస్తున్నాడు. స్నేహితులతో ఇతడికి వివాదాలున్నాయి. ఈనెల 11 నుంచి నవాజ్ కనబడకపోవడంతో తల్లిదండ్రులు రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నవాజ్ స్నేహితులైన అలీబామ్, మహ్మద్ ఖుస్రు, మహమూద్ షహబాజ్, ఆగా హుసేన్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. నవాజ్‌తో తమకు వివాదాలున్నాయని, తమను హత్య చేస్తామని హెచ్చరించడంతో భయపడి ఈనెల 11వ తేదీ రాత్రి అతడిని హత్య చేశామని అంగీకరించారు. మృతదేహాన్ని డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడేశామని చెప్పారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications