చదివింది ఎంబీఏ, చేసేది కార్ల దొంగతనం: ఎట్టకేలకు అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఆదివారం శ్వేతా గుప్తా అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. యువతి అరెస్టుతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంబీఏ పూర్తి చేసిన శ్వేతా గుప్తా రెండేళ్లలో వెయ్యికి పైగా వాహనాలను తస్కరించింది.
శ్వేతా గుప్తాను అరెస్టు చేసిన పోలీసులు పెద్ద సంఖ్యలో కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన శ్వేతా తొలుత సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే ఏజెన్సీలో ఉద్యోగినిగా పనిచేసింది. అక్కడే ఈ వాహనాలపై అవగాహన పెంచుకుంది.
ఆ తర్వాత ఐదుగురు సభ్యులతో ముఠాను ఏర్పాటు చేసుకుని కార్లను దొంగిలించడం మొదలుపెట్టింది. దొంగిలించిన వాహనాలను అమ్మేందుకు మూడు ఆఫీసులను కూడా ఏర్పాటు చేసుకుంది. కాన్పూర్, లక్నో, ఆగ్రాలోని పాత సామాన్ల డీలర్ల వద్ద లభ్యమయ్యేవి.

2007లో అలహాబాద్‌లోని ఓ వాహనాల ఏజెన్సీలో క్లర్క్‌గా చేరిన శ్వేతా, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ మార్గాన్ని ఎంచుకుంది. వేల సంఖ్యలో వాహనాలు దొంగిలించడంతో పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారారు.
శ్వేతా గుప్తా ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం రూ. 10,000 రివార్డుని కూడా ప్రకటించింది. చివరకు పోలీసులు గట్టి నిఘా ఉంచడంతో ఆదివారం ఈ అంతర్రాష్ట్ర కిలాడీ లేడీని ఆదివారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications