రైలు: మహిళను బయటకు తోసేసిన పోలీస్

పశ్చిమ బెంగాల్: వేగంగా వెళుతున్న రైలులో నుంచి మహిళను బయటకు తోసేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. తీవ్రగాయాలైన నేసా గిరి (34) అనే మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నదని సోమవారం పోలీసు అధికారులు చెప్పారు.

పోలీసుల కథనం మేరకు రమేష్ గిరి (38), నేసా గిరి దంపతులు. వీరిద్దరూ ఆజింగంజ్ రైల్వే స్టేషన్ లో తీస్తా-తోర్సా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. దంపతులు డార్జిలింగ్ లో దిగాల్సి ఉంది. ఇదే సమయంలో టిక్కెట్ కలెక్టర్, జీఆర్పీ కానిస్టేబుల్ రైలులోకి వచ్చారు.

 A woman passenger was pushed off a running train in West Bengal

తరువాత రమేష్ గిరితో అనవసరంగా గొడవపెట్టుకున్నారు. సాటి ప్రయాణికులు టిక్కెట్ కలెక్టర్, జీఆర్పీ కానిస్టేబుల్ తో పాటు రమేష్ కు నచ్చచెప్పారు. తరువాత జీఆర్పీ కానిస్టేబుల్ రమేష్ ల మద్య మాటామాటా పెరిగింది.

ఆ సందర్బంలో నేసా గిరి భర్తను పక్కకు పిలుచుకుని వెళ్లడానికి ప్రయత్నించింది. సహనం కొల్పోయిన కానిస్టేబుల్ మహిళ అనికూడ చూడకుండా నేసా గిరిని వేగంగా వెళుతున్న రైలు లో నుంచి కిందకు తోసివేశారు. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు నేసా గిరిని ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+