పెళ్లి కానుక: విషం పెట్టి చంపిన భర్త, అత్తామామలు

Woman poisoned to death by husband and in-laws
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కక్రోలి గ్రామంలో దారుణం జరిగింది. పెళ్ళి కానుకలు తమకు తిరిగి ఇవ్వలేదని ఆగ్రహానికి గురైన భర్త, అత్తామామలు ఓ మహిళకు విష పెట్టి హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. గత మార్చి 27న సాల్మా(20) అనే బాధిత యువతి నిందితుడు జావేద్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఆ తర్వాత ఏప్రిల్ 15న ఇరు కుటుంబాల అంగీకారంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో సల్మాకు భర్త పేరున ఉన్న 2 బిగాల భూమిని ఆమె పేరున చేశారు. కాగా, వివాహం అయిన నెల రోజుల నుంచే ఆమెపై భర్త, అత్తామామలు వేధింపులు మొదలుపెట్టారు. తమ భూమిని తమకు ఇవ్వాలని ఆమెను చిత్రహింసలకు గురిచేశారు.

ఈ క్రమంలో ఆదివారం ఆమెకు భర్త, అత్తామామలు విషం ఇచ్చి హత్య చేశారు. తన కూతురు మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురైన సల్మా తండ్రి అహ్మద్ పోలీసులను ఆశ్రయించాడు.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కక్రోలి పోలీసులు నిందితులైన సల్మా భర్త జావేద్, అత్తామామలు సన్నో, అస్లాం, బావ బుర, అతని భార్య సబ్ర బేగంలపై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+